మహబూబాబాద్ ఉద్రిక్తత..కేటీఆర్‌ ఫ్లెక్సిల చించివేత

-

Mahbubabad tension Tearing of KTR Flexi: మహబూబాబాద్ ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్‌ ఫ్లెక్సిలను చించివేశారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద మహధర్నాకు రెడీ అవుతోంది. ఈ మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…మాజీ మంత్రులు , ఎమ్మెల్సీలు…మాజీ ఎమ్మెల్యేలు హజరు కాకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సిలను చింపారు గుర్తు తెలియని వ్యక్తులు.

Mahbubabad tension Tearing of KTR Flexi

దీంతో ఫ్లైక్సిల్ రగడ పై ఆరా తీస్తున్నారు పోలీసులు. మహధర్నా కు భారీగా పోలీసులు బందోబస్త్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ధర్నాలో ఏమి జరుగుతుందోనని పోలీసులు, స్థానికులు టెన్షన్ పడుతున్నారు. అటు ధర్నాను అడ్డుకొని తీరుమని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారట. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నిరసన తెలిపేందుకు కాంగ్రెస్‌ నేతలు రెడీ అవుతున్నారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version