హెచ్చరిక: ఏపీవాసులకు మరో విపత్తు!

-

ఏపీ వాసులకు అనుకోని ఒక విపత్తు రాబోతుందంట! ఇప్పటికే కరోనాతో అల్లల్లాడుతున్న ఏపీ వాసులకు ఇది అత్యంత చేదువార్త! ఇంతకూ అదేమిటంటారా… ఈ నెలాఖరుకి అల్పపీడనం వచ్చిపడబోతుండటమే! అవును… కరోనా వేళ ఏపీకి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. ఓవైపు కరోనా తీవ్రత తగ్గకపోగా.. దాన్ని మరింత పెంచేందుకన్నట్లుగా… దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడి బలపడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో శనివారం మొదలు వరుసగా నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

దీంతో… ఈ సమయంలో మళ్లీ ఇదేమి శాపంరా దేవుడా అని బాదపడాల్సిన పరిస్థితి. ఇంతకూ వర్షాలు పడితే కరోనా తీవ్రత ఎక్కువ అవుతుందని ఫీలవుతున్నారా? అంటే… అదొక్కటే కాదు! అవును… ఈ సమయంలో ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే.. వైరస్ వ్యాప్తి అంత తక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే… ఎండలు తగ్గి వర్షాలు పెరిగితే మాత్రం కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చొచ్చని అంటున్నారు. అంతే కాదు… ఇది కోతల సమయం… వరి పంట కుప్పనూర్పులకు వచ్చిన దశ… మామిడి కాయలు కోయడానికి సరిగ్గా సరైన సమయం… మిర్చి కూడా పొలాల్లో ఎండబెట్టిన పరిస్థితి… ఇలాంటి ఎన్నో రైతన్న సమస్యల మధ్య… ఏపీకున్న సమస్యల్లో నేనూ చేరతాను అన్నట్లుగా రాబోతున్నాడట వరుణుడు!

ఈ సమాచారం అనంతరం ఏపీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్లాల్లో ఉన్న పంటలు ఇంటికి చేర్చుకోవాల్సిన పరిస్థితి… ఇప్పటివరకూ కోసుకుని ముగ్గేసుకున్న మామిడి రైతు సంగతి పర్లేదు (ఎందుకంటే… ఇప్పటికే మామిడి ఎగుమతులు ప్రారంభించింది ఏపీ సర్కార్) కానీ… ఇంకా కోతకు రాని మామిడిరైతు పరిస్థితి? అరటి రైతు పరిస్థితి? వాతావరణంలో తేమ, శీతల వాతావరణం ఉంటే కరోనా మరింతగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్న తరుణంలో.. సమాన్యుడి పరిస్థితి? అంతా జాగ్రత్తగా ఉండాలి సుమా?

Read more RELATED
Recommended to you

Latest news