ప్రపంచవ్యాప్తంగా పదిమందిలో ఒక్కరికి కరోనా.. WHO.

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృత పెరుగుతూనే ఉంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసిన కథనాల ప్రకారం ప్రపంచ జనాభాలో ప్రతీ పదిమందిలో ఒక్కరికీ కరోనా సోకి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 3,53,47,404మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 10.3లక్షల మంది మరణించారు. ఐతే ప్రపంచ జనాభాలో పదిశాతానికి మందికి పైగా కరోనా వ్యాపించని తెలిపింది.

ఈ వ్యాప్తి ఒక్కో దగ్గర ఒక్కోలా ఉందని, పట్టణాల్లో ఒకరకంగా, పల్లెటూళ్లలో ఒకరకంగా, దేశాన్ని బట్టి కూడా కరోనా వ్యాప్తిలో మార్పు ఉందని వెల్లడి చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో చాలా భాగం ప్రమాదంలో ఉందని, కాకపోతే దానిని నివారించే సాధనాలు మా వద్ద ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఐతే కరోనా వల్ల మరణాలు సంభవించడమే కాదు, ఆర్థికంగా నష్టపోవడం, శారీరక మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version