మన హోలీకి పాక్ లో రెండు రోజుల సెలవలు…!

-

పాకిస్తాన్ లో హిందువులను మనుషులుగా కూడా చూడరు అనే ప్రచారం మీడియాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాని అక్కడి ప్రజలు మాత్రం అందరూ కలిసే ఉంటారని కాని హిందువులు మాత్రం మైనార్టీ లు గా ఉంటారని అంటారు. పాకిస్తాన్ జనాభా 20 కోట్లు అక్కడ రెండు శాతం మంది హిందువులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో భారీగా హిందువుల సంఖ్య ఉంది అక్కడ. మరి మన పండగలకు అక్కడి ప్రభుత్వం చాలా విలువ ఇస్తుందని అంటున్నారు.

నేడు హోలీ… ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీ తో మన దేశంలో కాస్త హోలీ ఉత్సవాలు తక్కువగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌లో హోలీ సందర్భంగా రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. 2016 నుంచి పాక్ ప్రభుత్వం ఇక్కడి హిందువులు హోలీ వేడుకలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం విశేషం.

బలూచిస్తాన్ ముఖ్యమంత్రి కమాల్ ఖాన్ ఆ ప్రాంతంలోని హిందువులకు హోలీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా ఈ పండగ వసంత రుతువుకి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని హిందువులు ఇక్కడి సంస్కృతిలో కూడా భాగస్వాములయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. బలూచిస్తాన్‌లో అక్కడి మైనారిటీ వర్గమైన హిందువులు ప్రతీ ఏడాది ఎంతో ఘనంగా హోలీ ఉత్సవాలను జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news