నాగులచవితినాడు ఇలా చేస్తే సకల శుభాలు మీ సొంతం !

(నవంబర్‌ 18 నాగులచవితి ప్రత్యేకం)
కార్తీకం అంటే కార్తీకేయుడి మాసం. అంటే సుబ్రమణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కూడా పేరుగాంచింది. ఈ మాసంలో మొదట వచ్చే పెద్ద పండుగ నాగులచవితి. ఈరోజు ప్రాతఃకాలంలో లేచి స్నానసంధ్యానుష్టానాలు అంటే పూజ కార్యక్రమాలు చేసుకుని దగ్గర్లోని పుట్టలో ఆవుపాలు పోయాలి. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం..


దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్రస్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి, ముత్తైదువులకు అందజేయాలి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించుకుంటే శుభదాయకం. మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రగాఢ నమ్మకం. చెవికి సంబంధించిన బాధలు, కంటిబాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం అనేది వారి వయస్సు, ఆరోగ్యంలను అనుసరించి చేయాలి. పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, అనారోగ్యం వున్నవారు ఉపవాసం చేయకూడదు. భక్తి, శ్రద్ధలతో నాగేంద్రస్వామి ఆరాధన చేస్తే పుత్రపౌత్ర వృద్ధి జరగుతుంది.
– శ్రీ