ఒక్క‌సారి చార్జ్ చేస్తే 120 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. ఐఐటీ హైద‌రాబాద్ స్టార్ట‌ప్ ఆవిష్క‌ర‌ణ‌..

-

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పెట్రోల్ తో న‌డిచే టూవీల‌ర్లు కాకుండా విద్యుత్‌తో న‌డిచే వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అందులో భాగంగానే కంపెనీలు కూడా అలాంటి వాహ‌నాలను త‌యారు చేసేందుకే ఆస‌క్తిని చూపిస్తున్నాయి. ఇక ఐఐటీ హైద‌రాబాద్‌కు చెందిన ప్యూర్ ఈవీ అనే స్టార్ట‌ప్ అద్భుత‌మైన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను త‌యారు చేసి అందివ్వ‌డంలో ముందుంది. అందులో భాగంగానే ఆ స్టార్ట‌ప్ తాజాగా ఓ కొత్త స్కూట‌ర్‌ను ఆవిష్క‌రించింది.

pure ev startup to launch etrance neo electric scooter

ఐఐటీ హైద‌రాబాద్‌కు చెందిన ప్యూర్ ఈవీ అనే స్టార్ట‌ప్ కొత్త‌గా ఇట్రాన్స్ నియో అనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను రూపొందించింది. దీన్ని డిసెంబ‌ర్ 1న అధికారికంగా లాంచ్ చేయ‌నున్నారు. ముందుగా ఈ స్కూట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌భిస్తుంది. త‌రువాత దేశ వ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రాంతాల్లోని ఆ స్టార్ట‌ప్ స్టోర్స్‌లో ఈ స్కూట‌ర్‌ను విక్ర‌యిస్తారు. దీని ఎక్స్ షోరూం ధ‌ర రూ.75,999గా ఉండ‌నుంది.

ఇట్రాన్స్ నియో స్కూట‌ర్ కేవ‌లం 5 సెక‌న్ల‌లోనే 0 నుంచి 40 కిలోమీట‌ర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. ఇందులో 2500 వాట్ అవ‌ర్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీన్ని ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో స్కూట‌ర్‌పై ఏకంగా 120 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. అలాగే అధిక వేగంతో వెళ్లినా స‌పోర్ట్ ఇచ్చేలా ఈ స్కూట‌ర్‌ను ఇంట‌ర్న‌ల్ కంబ‌ష‌న్ ఇంజిన్‌తో రూపొందించారు.

ఈ సంద‌ర్భంగా ప్యూర్ ఈవీ వ్య‌వ‌స్థాప‌క‌ సీఈవో రోహిత్ వ‌డెరా మాట్లాడుతూ ఇట్రాన్స్ నియో స్కూట‌ర్ల‌ను తాము మొద‌టి ఏడాదిలో 10వేల యూనిట్ల వ‌రకు ఉత్పత్తి చేస్తామ‌ని తెలిపారు. 20కి పైగా రాష్ట్రాల్లో 100కి పైగా ప్రాంతాల్లో స్టోర్స్ ద్వారా ఈ వాహ‌నాన్ని విక్ర‌యిస్తామ‌న్నారు. కాగా ప్యూర్ ఈవీ ఇది వ‌ర‌కే ఇప్లుటో 7జి, ఇప్లుటో, ఇట్రాన్స్‌, ఇట్రాన్స్ ప్ల‌స్‌, ఇట్రాన్ ప్ల‌స్ పేరిట ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌గా వాటికి వినియోగ‌దారుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news