ప్రేమికుల జేబులు కాళీ చేసిన పోలీసులు..!

-

ప్రేమికుల దినోత్సవం అనగానే ప్రేమికులు చేసే సందడి అంత ఇంతా కాదు. తమ ప్రియుడు, ప్రియురాలితో కలిసి విహారయాత్రలకు, అందమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుంది. మన దేశం విషయానికి వస్తే ఆ రోజు ఆఫీసులకు, చదువులకు, వ్యాపారాలకు సెలవలు పెట్టి మరీ తమకు నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు యువత.

ఇలా చేసే వాళ్ళను పోలీసులు టార్గెట్ చేసారు. తమ జేబులు నింపుకోవడానికి ప్రేమికులను తనిఖీల పేరుతో వేధించారు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక, విహార ప్రాంతాలు ప్రేమజంటలతో కళకళలాడాయి. ఉదయం నుంచి పర్యాటక ప్రాంతాల్లో ప్రేమికుల సందడి నెలకొంది. బీచ్ లు, పార్కు లు, హోటల్స్, రిసార్ట్స్, అన్ని కూడా ప్రేమ జంటలకు నిలయమైయ్యాయి.

ఇదే అదను అనుకుని చెన్నై పోలీసులు జేబులు నింపుకున్నారు. వాహనాల్లో ఉత్సాహంగా వెళుతున్న ప్రేమజంటలను తనిఖీల పేరుతో బెదిరించి కొందరు పోలీసులు జేబులు నింపుకున్నారు. మోటార్ సైకిళ్ళు పై వెళ్లే ప్రేమజంటలను అపి వాహన పత్రాల తనిఖీ, హెల్మెట్‌ వంటి వాటిని వంక పెట్టీ పైసలు వసూలు చేశారు. పోలీసులు అడిగిన డబ్బును కట్టలేని కొన్ని ప్రేమజంటలు సమీపంలోని దుకాణాల్లో తమ విలువైన వస్తువులను తాకట్టు పెట్టీ మరీ పోలీసులకు చెల్లించారు.

Read more RELATED
Recommended to you

Latest news