ప్రపోజ్‌ డే చరిత్ర ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది..?

-

ప్రతి ఒక్కరి జీవితంలో.. ప్రేమ ఏదో ఒక సమయంలో చిగురిస్తుంది. కొన్ని ప్రేమలు కథల్లోనే మిగిలిపోతాయి.. కొన్ని మాత్రం క్లైమాక్స్‌కు చేరుతాయి. ప్రేమించడం కంటే.. ప్రేమించబడటం చాలా గొప్ప విషయం.. మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా పూర్తి విశ్వాసంతో ప్రేమిస్తుంటే.. మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేనట్లే.. ఈరోజుల్లో.. మార్కెట్లో కల్తీ లేని ఉత్పత్తులు ఉండటం లేదు.. అలాగే ప్రేమ కూడా కల్తీ అయింది.. కల్మషం లేని ప్రేమ దొరకడం లేదు.. ఒకవేళ మీకు దొరికందంటే.. మీరు లక్కీనే కదా..! ఈరోజు ప్రపోజ్‌ డే.. మీ ప్రేమను మరొకసారి వ్యక్తపరచండి..! అయితే మనం ప్రపోజ్‌ డే చరిత్ర గురించి తెలుసుకుందాం.!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రేమికులు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రేమను బయటపెట్టడం ద్వారా.. తమ మనసులో కోరిక బహిర్గతం అవుతుంది.. ఒకరిని ప్రేమిస్తూ.. ఆ విషయం బయటకు చెప్పలేకపోవడం వల్ల మనకుచాలా బరువెక్కిపోతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి. 8న ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ వీక్ రెండవ రోజున వస్తుంది.

ప్రపోజ్ డే చరిత్ర ప్రాముఖ్యత
ప్రపోజ్ డే చరిత్ర ఎక్కడా చక్కగా నమోదు చేయబడలేదు. కానీ కొన్ని నిర్దిష్ట సంఘటనలు ఈ వేడుకను ప్రభావితం చేశాయి. 1477లో, ఆస్ట్రియన్ ఆర్చ్‌డ్యూక్ మాక్సీ మిలియన్ ప్రత్యేక డైమండ్ రింగ్‌తో మేరీ ఆఫ్ బుర్గుండిపై తన ప్రేమను ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ ప్రపోజల్ డే ప్రారంభమైందని అంటున్నారు.

మరొక పురాణం ప్రకారం.. అతను 1816లో ప్రిన్సెస్ షార్లెట్‌తో నిశ్చితార్థం చేసుకున్న రోజు ఇది. ఏది ఏమైనప్పటికీ, ప్రతిపాదన రోజు అద్భుతమైన రోజు. మీ భావాలను మీ మనస్సులో పాతిపెట్టకుండా నేరుగా మీ ప్రేమను మీ ప్రేమను వ్యక్తపరచండి. ప్రేమను వ్యక్తపరిచే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఏంటంటే.. మీ ప్రేమను వాళ్లు తిరస్కరించవచ్చు, లేదా ఒప్పుకోవచ్చు.. రెండింటికీ మీరు సిద్ధంగా ఉండండి. రెండింటిని సమపాళ్లలో తీసుకునే శక్తిని మీరు కూడపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news