కరోనా నేపథ్యంలో గతేడాది కాలంగా ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఈ విషయంపై కూడా అనేక ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిల్లో ఒకటి.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మద్యం తాగకూడదని.. అయితే నిజానికి కోవిడ్ వ్యాక్సిన్‌కు, మద్యపానానికి సంబంధం లేదు. కానీ దీనిపై తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ తీసుకున్న తరువాత మద్యం సేవించవద్దని అటు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కానీ.. ఇటు ప్రభుత్వాలు కానీ.. సైంటిస్టులు కానీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ ద్వారా పలు సంస్థలు ధ్రువీకరించాయి కూడా. అయినప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మద్యం సేవించరాదనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడైంది.
అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మద్యం సేవించడంపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం పలు అభిప్రాయాలు తెలిపారు. వ్యాక్సినేషన్ అనంతరం అధిక మోతాదులో మద్యం సేవించవద్దని, సాధారణ స్థాయిలో మద్యం సేవిస్తే ఏమీ కాదని చెప్పారు. అందువల్ల కోవిడ్ వ్యాక్సిన్‌కు, మద్యం సేవించడానికి సంబంధం లేదని రుజువైంది.