విద్యార్థుల అకౌంట్ల‌లో రూ.7 ల‌క్ష‌లు వేస్తున్న మోదీ ప్ర‌భుత్వం.. నిజ‌మేనా..?

-

ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో ఫేక్ వార్త‌లు ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కొంద‌రు కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని నిజ‌మే అని న‌మ్మే కొంద‌రు మోస‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఫేక్ వార్త‌లు కోకొల్ల‌లుగా పుట్టుకొస్తున్నాయి. ఇక తాజాగా మ‌రొక వార్త కూడా ప్ర‌చార‌మ‌వుతోంది. అదేమిటంటే…

ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం జీవ‌న్ ల‌క్ష్య యోజ‌న అని ఒక కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింద‌ని, దీని కింద దేశంలోని విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్క‌రికీ రూ.7 ల‌క్ష‌ల చొప్పున జ‌మ చేస్తున్నార‌ని.. ఒక వార్త ప్ర‌చారం అవుతోంది. దీనికి చెందిన ప‌లు వీడియోలు కూడా యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ వార్తలో ఎంత మాత్రం నిజంలేద‌ని, అంతా అబ‌ద్ద‌మ‌ని వెల్ల‌డైంది.

ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కేంద్రం జీవ‌న్ ల‌క్ష్య యోజ‌న అనే ఎలాంటి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌లేద‌ని తెలిపింది. అందువ‌ల్ల ఆ వార్తలు పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version