Fact Check : కరెన్సీ నోట్లపై స్టార్‌ గుర్తు ఉంటే చెల్లవా..? ఆర్బీఐ ఏం చెప్తుంది..?

-

సోషల్ మీడియాలో కొన్నిసార్లు చిన్నదాన్ని పెద్దగా చేసి జనాలకు తెగ కంగారుపెట్టిస్తారు. అక్కడ ఏం లేకున్నా.. ఇంకేం ఉంది కొంపలంటుకుపోయాయి, ఇంకే లేదు.. త్వరగా చేసేయండి అంటూ ఏవేవో పోస్టులు పెడతారు. ఏదైనా త్వరగా స్ప్రెడ్‌ అవ్వాలంటే సోషల్‌ మీడియాను జనాలు ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు ఒక వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. కరెన్సీ నోట్లపై స్టార్‌ గుర్తు ఉంటే అది చెల్లదు అని. అసలు డబ్బు విషయంలో ఇలాంటి వార్తలు రావడంతో ప్రజలు ఇంకా భయపడతారు. ఇవి చెల్లవేమో అన్న ఆందోళన చాలా మందిలో నెలకొంది. దీనిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. ఆ గుర్తు ఏంటి, ఆ గుర్తు ఉన్న నోట్లు చెల్లుతాయో లేదా చెప్పింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కరెన్సీ నోట్లపై స్టార్ (*) గుర్తు ఎందుకు ఉంటుందన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. ఈ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఇతర కరెన్సీ నోట్లలాగానే చెల్లుతాయని స్పష్టం చేసంది. సీరియల్ నెంబర్ ముందు ఉండే స్టార్ గుర్తు మిగతా నోట్లలాగానే చెల్లుతాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.

స్టార్‌ గుర్తు ఎందుకు..?

స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు చెల్లుతాయా? అసలు ఈ గుర్తు ఎందుకు ఉంటుంది? అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో ఆర్‌బీఐ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఏవైనా కరెన్సీ నోట్లను రీప్లేస్ చేసినా, రీప్రింట్ చేసినా వాటికి స్టార్ సింబల్ ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. కరెన్సీ నోట్లు ముద్రించినప్పుడు ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి ప్రత్యామ్నాయంగా మళ్లీ నోట్లు ముద్రిస్తారని, అలాంటి కరెన్సీ నోట్లకు స్టార్ గుర్తు ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పుడే కాదు, ఆర్‌బీఐ గతంలో కూడా తెలిపింది. అయితే సోషల్ మీడియాలో అనుమానాలు తలెత్తడంతో ఆర్‌బీఐ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ఆర్‌బీఐ తరచుగా అడిగే ప్రశ్నల్లోని సమాధానం ప్రకారం, ఆగస్టు 2006 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు నోట్లు క్రమ సంఖ్యతో ఉంటాయి. ప్రతీ నెంబర్ భిన్నంగా ఉంటుంది. ప్రతీ బండిల్‌లో 100 కరెన్సీ నోట్లు ఉంటాయి. ప్రతీ నోటుకు సీరియల్ నెంబర్ ముందు ఆల్ఫాన్యూమరికల్ డిజిట్స్‌తో ఓ కోడ్ ఉంటుంది. అయితే బండిల్‌లో ఏదైనా ఒక నోటు సరిగ్గా లేనప్పుడు దాన్ని మళ్లీ ముద్రిస్తారు. అలా ముద్రించిన నోట్లకు స్టార్ గుర్తు ఉంటుంది. ఇలాంటి నోట్లకు ఆల్ఫాన్యూమరికల్ డిజిట్స్‌కు, సీరియల్ నెంబర్‌కు మధ్య స్టార్ గుర్తు ఉంటుంది.

ఒకవేళ మీ కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్ ఉన్నట్టైతే మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. మిగతా నోట్లలాగే ఈ కరెన్సీ నోట్లు కూడా చెల్లుతాయన్న విషయం గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. మనం వాట్సప్‌లో చాట్‌ చేసేప్పుడు ఏదైనా మెసేజ్‌ స్పెల్లింగ్‌ తప్పుగా పంపినప్పుడు మళ్లీ అదే మెసేజ్‌ పెట్టి స్టార్ పెడతాం. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఇదీ అంతే.. అయితే ఇప్పుడు ఆ బాధ లేకుండా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌ను ఎడిట్‌ చేయడానికి 15 నిమిషాలు టైమ్‌ ఇచ్చింది.!

Read more RELATED
Recommended to you

Latest news