బాబు డేరింగ్ స్టెప్..మాజీ ఎమ్మెల్యేలనే సైడ్ చేసేశారుగా.!

-

టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో మాదిరిగా మొహమాటలకు పోవడం లేదు. పార్టీ కోసం పనిచేయకపోతే ఎంతటివారినైనా సైడ్ చేయడానికి వెనుకాడనని మరోసారి రుజువు చేశారు. గతంలో ఇలా ఈ డేరింగ్ స్టెప్ తీసుకోక..మొహమాటానికి పోయి అభ్యర్ధులని ఫిక్స్ చేసి రిస్క్ లో పడ్డారు. దీని వల్ల టి‌డి‌పికి చాలా నష్టం జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని బాబు భావిస్తున్నారు.

ఈ సారి పార్టీ గెలుపు అనేది చాలా ముఖ్యం..లేదంటే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు అభ్యర్ధుల ఎంపిక విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే వారిని వెంటనే పక్కన పెట్టేసి యువనేతలకు ఛాన్స్ ఇస్తున్నారు. ఆ మధ్య గోపాలాపురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని సైడ్ చేసి ఇంచార్జ్ గా యువ నాయకుడు మద్దిపాటి వెంకటరాజుని నియమించారు. ఇక రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు పనితీరు మెరుగు పర్చుకోవాలని పలుమార్లు క్లాస్ ఇచ్చారు. అయినా ఆయనలో మార్పు లేదు.

దీంతో ఆయన్ని సైడ్ చేసి ఇటీవల రాజానగరం ఇంచార్జ్ గా బొడ్డు వెంకటరమణని నియమించారు. తాజాగా పార్వతీపురం విషయంలో సంచలన నిరణ్యం తీసుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులుని పక్కన పెట్టేశారు. 2014లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో విఫలమయ్యారు.

దీంతో చిరంజీవులుని సైడ్ చేసి..విజయ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. ఇలా చంద్రబాబు సరిగ్గా పనిచేయకపోతే సంచలన నిర్ణయాలు తీసుకుని సీనియర్ అని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు. మరి ఈ నిర్ణయాలు టి‌డి‌పికి ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news