Fact Check: చాయ్ తాగితే క‌రోనా రాదా, క‌రోనా త్వ‌ర‌గా న‌యం అవుతుందా ?

-

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇలాంటి త‌రుణంలో కోవిడ్ నుంచి సుర‌క్షితంగా ఉండేందుకు ప్ర‌జ‌లు సరైన స‌మాచారం తెలుసుకోవాలి. త‌ప్పుడు స‌మాచారం తెలుసుకుని పాటిస్తే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే సోష‌ల్ మీడియాలో అన్నీ త‌ప్పుడు వార్త‌లే ప్ర‌చారం అవుతున్నాయి. త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇంకో త‌ప్పుడు వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

చాయ్ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని, క‌రోనా వ‌చ్చినా చాయ్ తాగితే త్వ‌ర‌గా కోలుకుంటార‌నే వార్త ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డైంది. చాయ్ తాగితే క‌రోనా రాద‌ని, వ‌చ్చినా త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని తెలిపింది. ఈ మేర‌కు పీఐబీ ట్వీట్ చేసింది.

ఇక అంత‌కు ముందు పీఐబీ ఇలాంటిదే మ‌రొక వార్త‌ను ఫేక్ అని నిర్దారించింది. త‌మ‌ల‌పాకులు తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని, క‌రోనా న‌యం అవుతుంద‌ని ప్ర‌చారం చేశారు. కానీ అందులో వాస్త‌వం లేద‌ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలియ‌జేసింది. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి మెసేజ్‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని, ఒక్క‌సారి చెక్ చేసుకోవాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version