ఫ్యాక్ట్ చెక్: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా..? అయితే నిజమేంటో తెలుసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ వార్తలు వస్తున్నాయి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. లేదంటే మోస పోవాల్సి వస్తుంది. చాలా మందికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. మీకు కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా..? అయితే ఇందులో నిజం ఎంత అనేది తప్పక తెలుసుకోవాలి.

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రజల్ని అలెర్ట్ చేసింది. జాబ్ కోసం చూసే వాళ్ల కోసం ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ లు పంపించి.. ఫ్రాడ్స్టర్స్ మోసం చేస్తున్నారని చెప్పింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని షేర్ చేసింది. ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ బారిన పడొద్దు అని… ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ని నమ్మద్దు అని చెప్పింది.

Image

కొంత మంది ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ని పంపించారు. ఇలాంటి నకిలీ వార్తల్ని అస్సలు నమ్మొద్దు. వాటిని కనుక నమ్మితే మోసపోవాల్సి వస్తుందని చెప్పింది. అలానే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు నోటిఫికేషన్లు వస్తున్నాయని ఫేక్ సర్క్యులర్స్ ని కూడా పంపిస్తున్నారని చెప్పింది. అఫీషియల్ వెబ్సైట్లలో వచ్చే వాటిని మాత్రమే నమ్మాలి అని చెప్పింది. కాబట్టి అనవసరంగా నకిలీ వార్తలను నమ్మి మోసపోకండి. వీటిని కనుక నమ్మరు అంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news