కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని ఇప్పుడు భయపెడుతోంది. నిజంగా ఈ వైరస్ ఇప్పటికే ఎందరో మందిని బలి తీసుకుంది. దీనినుండి బయట పడటం నిజంగా ఎంతో కష్టం. మరో పక్క బ్లాక్ ఫంగస్ కూడా అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా సమయంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వినపడుతున్నాయి. ఈ తరహాలోనే మరొక వార్త వచ్చింది. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ఇలా వచ్చింది… టీకాలకి మైక్రో చిప్ అమరికని ఉంచి దానిని ఇవ్వడం వలన అయస్కాంత లక్షణాలు ప్రజలకు వస్తున్నాయన్న వీడియోలు వచ్చాయి.
వీటిలో నిజమెంత..? దీని గురించి చూస్తే.. తాజాగా వచ్చిన ఈ పోస్ట్ లో ఎటువంటి నిజం లేదని కేవలం ఇది వట్టి బూటకమని తెలుస్తోంది. ఈ ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని, అసలు సీరియస్ గా తీసుకోకుండా ఉండడం మంచిది.
అయితే వీడియో లో ఒక మహిళ తన చేతిని పెట్టి మాగ్నెటిక్ రియాక్షన్స్ ఉన్నట్లు చూపించింది ఆ తర్వాత చేతికి ఐస్కాంతం లాగే లక్షణాలు ఉన్నట్లు ఆమె వెల్లడించింది. ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్నో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు టిక్ టాక్ లో వస్తున్నాయి. ఇలాంటి ఫేక్ వార్తల్ని ఎవరూ నమ్మడం మంచిది కాదు కాబట్టి ఇటువంటి వాటిని ఎవరూ షేర్ చేయకండి.