ఫ్యాక్ట్ చెక్: ”PM ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం” కింద ఎనిమిది లక్షలు…? రూ.24,000 కడితే చాలు…!

-

సోషల్ మీడియాలో కనపడే నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. నిజానికి ఇలాంటి నకిలీ వార్తలని చూసి చాలా మంది అది నిజం అని అనుకుంటున్నారు. ప్రభుత్వ స్కీముల మొదలు ఉద్యోగాల వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక నకిలీ వార్త కనబడింది. ఇక దాని గురించి మనం చూద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల రూపాయలని లోన్ కింద ఇస్తోందని.. దీని కోసం 24 వేల రూపాయలను చెల్లించాలని ఆ వార్తలో ఉంది. పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఈ డబ్బులు వస్తున్నాయని కూడా రాసి వుంది ఈ నకిలీ వార్తలో. చాలామంది నకిలీ వార్తను నిజం అని భావిస్తున్నారు ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

మినిస్టరీ ఆఫ్ ఎం ఎస్ ఎం ఈ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఈ లోన్ ఇస్తోందనేది వట్టి నకిలీ వార్త. ఇలాంటి నకిలీ వార్తను చూసి చాలా మంది మోసపోతున్నారు. నకిలీ వార్త ఏది నిజమైన వార్త ఏది అని తెలుసుకోకుండా ఎలాంటి డబ్బులు కట్టకండి. ఈ లెటర్ లో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి ఎలాంటి లోన్ కోసం ఏ డబ్బులు కట్టకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version