నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు మనకి సోషల్ మీడియా లో కనపడుతూ ఉంటాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు కారణంగా మోసపోతున్నారు సోషల్ మీడియాలో స్కీముల మొదలు ఉద్యోగాల వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతూ ఉంటాయి.
చాలామంది స్కీములు ఉద్యోగాలు అని డబ్బులు కట్టి మోసపోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది ఇప్పుడు ఆ వార్త లో నిజం ఏమిటి అనేది చూద్దాం. కొన్ని మీడియా కథనాల ప్రకారం గదర్ 2 కోసం ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము కోసం విఐపి స్క్రీనింగ్ ఏర్పాటు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
Media reports claim that Exclusive VIP Screening of Gadar 2 is being organised for the President#PIBFactCheck
▶️ It is a regular screening that happens in Rashtrapati Bhavan & President had not wished for any such special screening. #President is not attending the screening. pic.twitter.com/4HgLemTyek
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2023
మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో జరిగే రెగ్యులర్ స్క్రీనింగ్ ఏ ఇది. అయితే ప్రెసిడెంట్ ఎలాంటి స్పెషల్ స్క్రీనింగ్ కోసం అడగలేదు పైగా ప్రెసిడెంట్ ఈ స్క్రీనింగ్ కి రావడం లేదు. ఇది వట్టి నకిలీ వారితో మాత్రమే అనవసరంగా ఇటువంటి వాటిని షేర్ చేయకండి పీఐబి ఫ్యాక్ట్ చెక్ కూడ దీని పై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పింది.