ఈ మధ్య కాలం లో ఫేక్ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఫేక్ వార్తల తో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ స్కీములు, ఉద్యోగాలు మొదలు ఎన్నో నకిలీ వార్తలను తరచూ మనం చూస్తున్నాం.
అయితే అనవసరంగా ఇతరులకు వాటిని పంపకుండా అందులో నిజమెంత అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా ఒక వార్త వచ్చింది అందులో నిజమెంత అనేది చూద్దాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని జారీ చేసిందని ఆ వార్తలో ఉంది. పైగా 15 వేల రూపాయలు కడితే మొబైల్ టవర్ ని ఇన్స్టాల్ చేస్తున్నట్లు కూడా ఆ వార్త లో ఉంది.
దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని కూడా జారీ చేయలేదు. ఇది కేవలం వట్టి ఫేక్ వార్తలు మాత్రమే. మొబైల్ టవర్ల కి సంబంధించిన ఫేక్ వార్తల్ని నమ్మకండి. వీలైనంత వరకు ఇలాంటి వార్తలకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.