విల్ స్మిత్ కు మద్దతుగా నిలిచిన కంగనా రనౌత్.. నేనైతే గట్టిగా తన్నేదాన్ని అంటూ ఫైర్

-

ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో హాలీవుడ్ స్టార్ యాక్టర్ విల్ స్మిత్, క్రిస్ రాక్ ను చెంపదెబ్బ కొట్టడం సంచలనం అయింది. విల్ స్మిత్ భార్య వ్యాధిపై జోకులు వేయడంతో విల్ స్మిత్ ఆగ్రహం తట్టుకోలేక స్టేజిపైకి ఎక్కి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటనపై విత్ స్మిత్ ను చాలా మంది విమర్శించారు. ఈ ఘటన తర్వాత క్రిస్ రాక్ కు విల్ స్మిత్ క్షమాపణలు కూడా చెప్పాడు.

ఇదిలా ఉంటే ఈఘటనపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. విత్ స్మిత్ కు మద్దతుగా నిలిచింది కంగనా. క్రిస్ ఇడియట్ లా మాట్లాడాడని ఆమె ఫైర్ అయింది. మహిళల వ్యాధిని అడ్డుపెట్టుకుని మాట్లాడితే నేను ఊరుకోను అని అంది. నేనైతే విల్ స్మిత్ కన్నా తగ్గిగా తన్నేదాన్ని అలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదని కంగనా ఫైర్ అయింది.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించడానికి వేదికపైకి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. క్రిస్ రాక్ తనదైన శైలిలో జోకులు పేల్చాడు. అప్పటి వరకు బాగానే ఉన్నా… క్రిస్, స్మిత్ భార్యపై జోక్ వేశాడు. జట్టు రాలిపోయే వ్యాధితో బాధపడుతున్న స్మిత్ భార్యపై  జోక్ వేయడంతో తట్టుకోలేక క్రిస్ రాక్ పై, స్మిత్ చేయి చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news