ఫ్యాక్ట్ చెక్: విద్యార్ధులకి గుడ్ న్యూస్… ఫ్రీగా ల్యాప్టాప్స్..?

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో అనేక రకాల నకిలీ వార్తలు వస్తున్నాయి. ఏది నిజమైన వార్త..? ఏది నకిలీ వార్త అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. నిజానికి నకిలీ వార్తలని తెలుసుకోవడం ఎంతో ముఖ్యము. సోషల్ మీడియా లో తరచు మనకి నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి నకిలీ వార్తను చూసే చాలా మంది మోసపోతూ ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్త గురించి చూస్తే… గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా విద్యార్థులకు లాప్టాప్ లని అందిస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ లాప్టాప్ స్కీమ్ 2023 కింద ఫ్రీగా విద్యార్థులకు లాప్టాప్ లని ఇస్తుందని సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది ఈ వార్త.

మరి ఇది నిజమా కాదా..? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా విద్యార్థులకు లాప్టాప్ లని ఇస్తోందా..? ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ లాప్టాప్ స్కీమ్ 2023 కింద ఫ్రీగా విద్యార్థులకు లాప్టాప్ లని ఇస్తున్నారా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటి వార్తలను నమ్మి మోసపోవద్దు అలానే ఇతరులకి కూడా ఇటువంటి నకిలీ వార్తలని పంపకండి.