ఈ మధ్య కాలం లో స్కీమ్స్ పేరుతో మోసాలు ఎక్కువై పోయాయి. ప్రభుత్వం ఆ స్కీమ్ ఇస్తోందని, ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇస్తోందని మోసం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువై పోవడంతో ఆన్లైన్ మోసాలు పెరిగి పోయాయి. అయితే వచ్చిన ఈ వార్తలని నమ్మాలా లేదా అనేది కూడా ప్రజలకి అర్థం అవ్వడం లేదు. అయితే తాజాగా మరోక వార్త వచ్చింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి బేరోజ్గార్ భట్ట యోజన కింద నెలకి 3500 రూపాయలని ప్రజలకు ఇస్తున్నట్లు అందులో ఉంది. అయితే నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తోంది..? నిజం ఎంత అనేది చూస్తే… గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి పథకాన్ని ఏమి తీసుకురాలేదు. దీని వల్ల ప్రజలకు నెలకి 3500 రావు.
A viral message circulating on #Whatsapp claims that the Government of India is providing ₹ 3,500 per month under the 'Pradhan Mantri Berojgar Bhatta Yojana'.#PIBFactCheck
▶️No such scheme is being run by GOI.
▶️Do not click on any suspicious links. pic.twitter.com/blLDcVBOHN
— PIB Fact Check (@PIBFactCheck) February 1, 2022
ఇది కేవలం నకిలీ వార్త. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు. నమ్మరంటే మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి స్కీములు నమ్మి అనవసరంగా మోసపోవద్దు. అలానే అనుమానంగా ఉండే లింక్స్ మీద క్లిక్ చేయవద్దు. ఒకవేళ కనుక మీరు వాటిపై క్లిక్ చేశారంటే అనవసరంగా మీరు మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండటం మంచిది.