డిసెంబ‌ర్ 1 నుంచి కోవిడ్ ప్ర‌త్యేక రైళ్ల‌ను నిలిపివేస్తారా ? నిజ‌మెంత ?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఫేక్ వార్త‌లు కూడా ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతున్నాయి. దీంతో జ‌నాల‌కు ఏది అస‌లు వార్తో, ఏది న‌కిలీ వార్తో తెలియ‌డం లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఫేక్ వార్త‌లు ఎక్కువ‌గా ఫార్వార్డ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌తీయ రైల్వే గురించి ఒక వార్త విస్తృతంగా ప్ర‌చారం అవుతోంది.

is it true that indian railways will stop covid special trains

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం భార‌తీయ రైల్వే కేవ‌లం ప్ర‌త్యేక కోవిడ్ రైళ్ల‌ను మాత్ర‌మే న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే డిసెంబ‌ర్ 1 నుంచి ఆ రైళ్ల‌ను కూడా నిలిపివేస్తుంద‌ని, దీంతో మొత్తం అస‌లు రైళ్లే న‌డ‌వ‌వ‌ని ఒక వార్త సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేద‌ని తేలింది. ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విష‌యం వెల్ల‌డైంది.

కరోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక ఫేక్ వార్త‌లు చెలామ‌ణీలో ఉన్నాయి. అందువ‌ల్ల ప్ర‌జ‌లు అలాంటి వార్త‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఒక వార్త‌ను న‌మ్మే ముందు అది నిజ‌మా, కాదా అనే విష‌యాన్ని రూఢి చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news