పీఎం ముద్ర యోజన ఫేక్ లెటర్ వైరల్…!

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలుకి హద్దు అదుపు లేదు. ఏదో ఒక ఫేక్ సమాచారం మనకి కనబడుతూనే ఉంది. ముఖ్యంగా మహమ్మారి సమయం నుండి కూడా ఎన్నో ఫేక్ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అలాంటి వార్త ఒకటి వచ్చింది.

ఇక దాని కోసం చూస్తే… ప్రధాన మంత్రి ముద్ర యోజన పేరుతో వచ్చిన ఒక లెటర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ స్కీమ్ కింద లోన్ పెట్టుకో వచ్చని రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాలని అందులో ఉంది.

అదే విధంగా ప్రధాన మంత్రి ముద్ర లోన్ సంవత్సరం వరకూ ఇస్తారని… నెల వారి ఈఎంఐ వివరాల్ని కూడా అందులో రాసి ఉంది. ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక దీనిలో ఎంత నిజం అనేది చూస్తే… దీనిలో ఏ మాత్రం నిజం లేదని కేవలం ఫ్రాడ్ అని తెలుస్తోంది.

ఎప్పుడూ కూడా సరైన వెరిఫికేషన్ లేకుండా సోషల్ మీడియా పోస్టులను నమ్మద్దు. నిజంగా అలాంటి ఫేక్ వార్తలను నమ్మితే తప్పక మోసపోవాల్సి ఉంటుంది కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version