ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను ఇస్తుందా ఏంటి?

-

చదువు ఉన్నా లేకున్నా కూడా అందరికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.అందరి ఫొన్లలో సోషల్ మీడియా ఉంటుంది..అయితే ఇందులో నిజాల కన్నా కూడా అబద్దాలకు ఎక్కువ ప్రచారం జరుగుతుంది.వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకుని అవగాహన పెంచుకునేందుకు దోహదపడే సోషల్ మీడియాను కొందరు ఫేక్ ప్రచారాలకు వేదికగా మార్చుకుంటున్నారు. అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తూ నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేని గందరగోళ స్థితిలోకి ప్రజలను నెట్టేస్తున్నారు..

 

గతంలో ఎన్నో ఫేక్ వార్తల పై ప్రచారం జరిగింది..ఇప్పుడు మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.విద్య యొక్క అవసరాన్ని తెలియజేసేందుకు ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయనుందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కోడై కూసింది. ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రాంలో, ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారానికి తెరలేపిన కేటుగాళ్లు ఎంతలా బురిడీ కొట్టించారంటే.. ఫోన్ల ఫొటో వేసి.. పైన కేంద్ర విద్యా శాఖ ఈ ప్రకటనను జారీ చేసినట్టుగా క్రియేట్ చేశారు.అంతేకాదు వెంటనే ఆన్లైన్ అప్లై చేసుకొండి అనే అప్షన్ ను కూడా ఇచ్చారు.

దీని పై చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు.ఈ ఫేక్ ప్రచారాన్ని PIB Fact Check ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారేసింది. ఇది ఫేక్ ప్రచారమని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. విద్యా శాఖ ఇలాంటి ఏ స్కీంను తీసుకురాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిరాధార వార్తలను, ఇలాంటి అసత్య ప్రచారాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు PIB Fact Check పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇంటర్నెట్‌లో సత్య దూరమైన ప్రచారాలను తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశం…ఇప్పుడు వచ్చిన వార్త కూడా ఫేక్ అని తేల్చింది.ఇలాంటివి నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version