పుట్టినబిడ్డకు తేనె తినిపిస్తున్నారా.. కాటుక పెడుతున్నారా.. ఆచారం వెనుక అనర్థాలు

-

కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియే అయినా.. ఈ పరిస్థితి వచ్చే సరికీ అందిరికీ కంగారు, ప్రత్యేక శ్రద్ద, ఒకింత భయం వచ్చేస్తుంది. మహిళ జీవితంలో ముధురమైన జ్ఞాపకాలలో ఒకటి.. ప్రెగ్నెస్సీ కన్ఫామ్ అయిందని తెలిసిన క్షణం. పెళ్లికిముందు ఈ విషయం తెలిస్తే.. ఇదే చేదుజ్ఞాపకం అవుతుందనుకోండి. ఆ విషయం వదిలేస్తే.. పెళ్లైన తర్వాత చాలామందికి గర్భిణీ అవుతున్నాం అని తెలిసిన రోజు ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఇక అప్పటినుంచి ఆరోగ్యం పై శ్రద్ధ పెరుగుతుంది. జాగ్రత్తగా ఆ తొమ్మిదినెలలు.. బిడ్డను పొట్టలో మోస్తూ.. ఒకరోజు అయితే డెలివరీ అవుతుంది. ఈ స్జేజ్ ఇంకా బాగుంటుంది. అయితే.. మన పెద్దోళ్లు కొన్ని ఆచారాల పేరిట పుట్టినబిడ్డకు చేయకూడనవి ఈరోజికి చేస్తున్నారు. వాటివల్ల పసిబిడ్డ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అవేంటో, ఎందుకు చేయకూడదో తెలుసుకుందామా..!
నవజాత శిశువు నోటిలో తేనె వేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లాడు తియ్యగా ఉంటాడు అని పెద్దోళ్లు తేనె నాకిస్తారు. కానీ దీని వల్ల బోటులిజం అనే ఒక రకమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా సాధారణంగా ఏదైనా ఆహారం నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన బిడ్డ కాళ్ళను నిఠారుగా ఉంచడానికి గట్టిగా గుడ్డ చుడతారు. లేకపోతే వారి కాళ్ళను నిటారుగా ఉండవు అని అంటారు. ఇలా బిగుతుగా ఉన్న కట్టుతో పిల్లలకి అసౌకర్యంగా అనిపించడమే కాకుండా ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది.
కళ్ళు ,నుదిటిపై కాటుక పెట్టడం.. ఇక ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూపాయి బిల్లంత బొట్టు పెడతారు కాటుకతో.. బుగ్గన ఒకటి, నుదిటిపైన ఒకటి.. దిష్టి తగలకుండా ఇలా చేస్తారు కానీ.. అంతంత కాటుక కళ్లకు, బుగ్గకు, నుదిటికి పెడితే.. అసలు పిల్లాడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. దిష్టిబొమ్మను తయారుచేసినట్లు చేస్తారు కొందరైతే.. కాటుక మనం స్వంతగా తయారు చేసుకుంది అయితే లైట్ గా పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఉన్న కాజల్ కెమికల్ పిల్లల చర్మానికి ఏమాత్రం సురక్షితం కాదు. దాన్ని తెచ్చి ముఖం అంతా పులిమేయడం అసలే మంచిది కాదు.
రొమ్ము పాలతో చెవి ఇన్ఫెక్షన్‌కు చికిత్స.. తల్లి పాలు శిశువుకు అత్యంత పోషకమైనవి. అయితే, చెవి నొప్పి ఉంటే కాదు. నవజాత శిశువుకు చెవి నొప్పి ఉంటే ఒక చుక్క తల్లి పాలను చెవిలో వేయమని ఎప్పటినుంచో పెద్దోళ్లు అనే మాట. కానీ అలా చేస్తే ఆ పాలలో బ్యాక్టీరియా గూడు కట్టుకుని అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
బేబీకి కడుపునిండా ఫుడ్.. పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల కడుపు నిండుగా ఉంటుందని, తద్వారా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లి పాలు తప్ప మరేది ఇవ్వకూడదు, శిశువు ఆహారం ఈ సందర్భంలో కడుపు ఇన్ఫెక్షన్ కు దారితీయొచ్చు.
నవజాత శిశువులను సాయంత్రం తర్వాత చీకటిలో బయటకు తీసుకురాకూడదు – ఈ సంప్రదాయ నమ్మకం కూడా ఒక మూఢనమ్మకమే.. శిశువులను అన్ని సమయాలలో తాజా గాలిలో తీసుకువెళ్లవచ్చు, ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు చేయకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు.
మేక పాలు ఎక్కువ పోషకమైనవి – ఆవు పాల కంటే మేక పాలు ఎక్కువ పోషకమైనవి అని అంటారు. 6 నెలల తర్వాత ఎదుగుదలకు మేక పాలు ఇవ్వకూడదు, అది జీర్ణం కాకపోతే చివరికి శిశువు శరీరం చెడుగా మారుతుంది.
పూర్వం రోజుల్లో చేసినవి ఈరోజుకి చేస్తాం.. ఏమైంది మాకు చేశారు, నేను మా బిడ్డకు చేశాను.. ఇప్పుడు వాడిబిడ్డకు కూడా అలానే చేస్తాం అని పెద్దోళ్లు అనొచ్చు. రోజులు మారాయి.. మిడిమిడి జ్ఞానంతో ఏదిపడితే అది చేయడం నవజాత శిశువుకు మంచికి కాదు. వాడే సబ్బు నుంచి మొదలు అన్నీ కేర్ తీసుకుని.. వైద్యులను సంప్రదించే చేయాలని విషయం ప్రతి తల్లీ గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version