ఎండకాలం వచ్చింది అంటే పంటలు పండించడం చాలా కష్టమైన పని..ముఖ్యంగా పూల మొక్కలను నాటడం ఇంకా కష్టం. చలికాలంలో పూల తోటలు వేయడం మంచిది.ఆ సీజన్ లో ఎక్కువగా పూల దిగుబడి కూడా ఉంటుంది.అయితే వేసవిలో కూడా గుబాళించే అందమైన పువ్వుల తోటలు వేయవచ్చునని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వేసవిలో ఎటువంటి పూల తోటలను వేస్తే మంచి దిగుబడి వస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
బాల్ లిల్లీ..
ఇవి చూడటానికి ఒక బాల్ ఆకారం లో ఉంటాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది.ఇందులో ఒక మొక్కలో ఏడాదికి ఒక పువ్వు మాత్రమే వస్తుంది. ఈ పువ్వు వేసవి కాలంలో మాత్రమే వస్తుంది. చాలా ఆకులు పువ్వు కింద వస్తాయి. అలాగే ఆ మొక్కకు గడ్డలు కూడా వస్తాయి అవి మొక్కలు అయ్యి పువ్వులు పూస్తాయి.
ట్యూబెరోస్..
సంపంగి, లిల్లీ పుప్ప్వులు అందరికి తెలుసు..ఆ పువ్వులనే ట్యూబెరోస్ అని పిలుస్తారు.మనసు పులకరించే సువాసనను కలిగి ఉంటాయి.మొక్క 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండే స్పైక్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఈ మొక్క చాలా వారాలా పాటు పువ్వులను ఇస్తూనే ఉంటుంది.
గ్లాడియోలస్..
గ్లాడియోలస్ దక్షిణ ఐరోపా, ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ పువ్వులు తొందరగా వాడిపోవు..ఎక్కువ కాలం సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.గ్లాడియోలస్ వివిధ రంగులలో కనిపిస్తాయి. ఒక్క పూల కర్ర ధర రూ.25 నుంచి 30 వరకు ఉంటుంది..మంచి ధరతో పాటు డిమాండ్ కూడా ఎక్కువే.
అగాపంథస్..
అగాపంథస్ అందమైన ప్రకాశవంతమైన ఊదా లేదా తెలుపు పువ్వుల సమృద్ధిని కలిగి ఉంది. ఇవి చాలా త్వరగా పెరుగుతాయి.ఒకసారి ఈ మొక్కలను నాటితే వాటంతట అవే పెరుగుతాయి.అలా పెరగడానికి మూలాలను అందించాలి..ఆ తర్వాత అవే గుంపులుగా పెరుగుతాయి..
ఈ మొక్కల పెంపకం గురించి ఒకసారి వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకొని నాటడం మంచిది.