స్ఫూర్తి: మిల్లెట్ ఇడ్లీలు అమ్ముతూ నెలకు లక్షల్లో లాభాలు.. !

-

అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అవకాశాలని కల్పించుకోవాలి. చక్కటి నిర్ణయం తీసుకుని ధైర్యంగా ముందుకు వెళితే జీవితంలో ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ లో చిట్టెం సుధీర్ కూడా సక్సెస్ అవ్వడానికి మంచి స్టెప్ ని తీసుకున్నారు. ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీలను అమ్ముతూ నెలకి లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు.

 

మొదట ఈయన 2018లో ఇడ్లీ స్టాల్ ను ప్రారంభించారు. 50 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈ వెంచర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కొర్రలు, సామలు మొదలైన వాటితో ఇడ్లీలని తయారు చేసి అమ్ముతున్నారు చట్నీ అయితే అల్లం, క్యారెట్ వంటి వాటితో చేస్తున్నారు. ఇలా అతను ఇడ్లీ స్టాల్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.

ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టడంతో ఇలాంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. సుధీర్ రెండు స్టాల్స్ ని రన్ చేస్తూ రోజుకు 500 ప్లేట్లను సేల్ చేయడం జరుగుతోంది. అదే సెలవు రోజుల్లో అయితే 600 ప్లేట్లు అమ్ముడవుతాయి. ఒక ప్లేట్ కి మూడు ఇడ్లీలు అమ్ముతారు. ఒక ప్లేటు ధర 50 రూపాయలు.

ఇది ఇలా ఉంటే సుధీర్ మూడేళ్ల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆగ్రో ఎకనామిక్స్ లో పీజీ పూర్తి చేశారు ఉద్యోగంలో చేరే బదులు స్వయంగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు. పైగా తాను చదివిన కోర్సు స్ఫూర్తిని ఇచ్చింది సుధీర్ కి. నిజానికి ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయింది. ఇలా ఇప్పుడు చక్కగా మిలెట్ ఇడ్లీల ద్వారా సక్సెస్ అయ్యారు. నిజానికి చాలా మంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. అలాంటి వాళ్లు ఈయనని ఆదర్శంగా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version