ఢిల్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఖాళీలు.. ఇలా ఈజీగా అప్లై చేసుకోచ్చు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఆయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మొత్తం 25 ఖాళీలని భర్తీ చేస్తోంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే., అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 10, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు (గ్రేడ్‌ 1): 6, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు (గ్రేడ్‌ 2): 9 వున్నాయి. అర్హతల వివరాలని చూస్తే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్, రీసెర్చ్‌ విభాగాల్లో తప్పని సరిగా అనుభవం ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే.. ఏడాదికి రూ.8,78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2022. హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ మే 5, 2022. అడ్రస్‌: డైరెక్టర్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), జీటీ కర్నాల్‌ రోడ్‌, ఢిల్లీ-110036.

 

 

Read more RELATED
Recommended to you

Latest news