నగ్నంగా పెళ్లి కూతురు ఫోటోలు తీసి అడ్డంగా బుక్కయ్యాడు…!

-

ఫోటోలు తీయడం అనేది ఓ ఆర్ట్. అంత వీజీగా అందరికీ రాదు. ఫోటోగ్రాఫర్లంతా తమ మెదడుకు పని పెట్టి మరీ రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీస్తుంటారు. ఓ ఫోటోగ్రాఫర్ కూడా ఇలాగే తన మెదడుకు పదును పెట్టి ఓ పెళ్లి కూతురు ఫోటోలు తీశాడు కానీ అనవసర చిక్కుల్లో పడ్డాడు. పెళ్లి కూతురు ఫోటోలను మామూలుగా తీస్తే ఏముంటుంది కిక్కు అనుకున్నాడో ఏమో.. నగ్నంగా పెళ్లి కూతురు ఫోటోలను తీసి అడ్డంగా బుక్కయ్యాడు.

కోల్ కతాకు చెందిన ఈ ప్రీతమ్ మిత్రానే ఈ వినూత్న ఫోటో తీసింది. పెళ్లికూతురులా ఓ మోడల్ ను ముస్తాబు చేసి తన ముఖం కనిపించకుండా తమలపాకులు, వక్షోజాలు కనిపంచకుండా తల వెంట్రుకలు, ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా కుంకుమ భరిణెను అడ్డం పెట్టగా.. ఆ ఫోటోను తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం బెంగాళీలకు తెలిసింది.

వాళ్లు అగ్గిమీద గుగ్గిలం అవడమే కాదు.. ప్రీతమ్ ను చంపేస్తామంటూ అతడికి ఫోన్లు చేయడం, సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం చేస్తున్నారు. బెంగాళీ వివాహ వ్యవస్థపై సెటైర్లు వేస్తావా? హిందువులను అవమానిస్తావా? హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని అపవిత్రం చేస్తూ.. కుంకుమ భరిణె, తమల పాకులను పెట్టుకోరాని చోట పెడతారా? అంటూ అతడిని బెదిరించేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడట. ప్రస్తుతం పోలీసుల రక్షణలో ఉన్నాడట ప్రీతమ్. చూశారా.. క్రియేటివిటీ కాస్త మనోడిని ఎక్కడికి తీసుకెళ్లిందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version