ట్రెయిన్ లో మనసిచ్చిన యువతి కోసం 4 వేల పోస్టర్లతో వెతుకులాట.. నువ్వు గ్రేట్ బాసూ..!!

-

ప్రేమ గుడ్డిదా.. మంచిదా.. చెడ్డదా.. అసలు ప్రేమంటే ఏంటి. అదో ఫీలింగా? లేక ఇంకేంటి. అది దగ్గరుంటే ఆకలేయదు.. నిద్రరాదు.. ఏం చేయాలనిపించదు.. అది ఎప్పుడు పుడుతుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు.. ఇదిగో ఇలాంటి వంద డౌట్లు ఉంటాయి ప్రేమ మీద. కానీ.. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. మనం ఒకరిని ప్రేమించడం కాదు.. ప్రేమించబడటం గొప్ప అంటారు పెద్దలు.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా.. అంటే ఓ యువకుడు ట్రెయిన్ ఎక్కాడు. సీటులో కూర్చున్నాడు. పక్కనే ఓ అమ్మాయి కనిపించింది. చూపులు కలిశాయి. రెండు గంటల ప్రయాణంలో అమ్మాయికి తన మనసు ఇచ్చేశాడు. కానీ.. ఇంతలోనే విధి అతడితో ఆడుకోవడం ప్రారంభించింది. ఆ అమ్మాయి తను దిగాల్సిన స్టేషన్ రాగానే దిగేసింది. వెళ్లే ముందు వెనక్కి తిరిగి మనోడిని చూసి ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది. అదిగో.. అక్కడే పడిపోయాడు మనోడు. మనోడి మనసును తీసుకెళ్లిపోయింది ఆ అమ్మాయి.

ఆ అమ్మాయి ఊరు తెలియదు.. పేరు తెలియదు.. ఎలా వెతకడం. ఎలాగైనా ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలి. అమ్మాయిని కనుక్కోవాలని చేయని పని లేదు. కానీ.. ఆ అమ్మాయి ఆచూకీ మాత్రం తెలియలేదు. చివరకు తను దిగిపోయిన స్టేషన్ దగ్గర్లోనే ఉంటుందేమో అక్కడే ట్రై చేస్తే బెటర్ అనుకున్నాడు. కానీ.. ఆ ప్రాంతమంతా తిరిగి కనుక్కోవడం కష్టమని ఓ మాంచి ఐడియాను పట్టుకున్నాడు. దాదాపు 4000 గోడ పోస్టర్లను తయారు చేయించాడు. ఆ పోస్టర్ లో మనోడి ఫోన్ నెంబర్ రాసి ఆమెను ట్రెయిన్ కలిసినప్పుడు ఉన్న డ్రెస్ తో ఫోటో దిగి.. ఆ ఫోటోను దాంట్లో వేసి యూట్యూబ్లో తన ప్రేయసి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్నాగరర్ కొనే అనే ఓ వీడియో లింక్ ను కూడా పోస్టర్ లో పెట్టాడు. ఇక.. ఆ యువతి ఉంటున్న ఏరియా అంతటా ఈ పోస్టర్లను అంటించాడు. ఎలాగైనా అ అమ్మాయి ఆ పోస్టర్ చూసి తనకు ఫోన్ చేస్తుందనే ఒకే ఒక్క చివరి ఆశతో బతుకుతున్నాడు అమర ప్రేమికుడు.

ఇంతకీ ఈ సినిమాస్టోరీని తలపించే ఘటన ఎక్కడ జరిగిందంటే.. కోల్ కతాలో. ఆ అమర ప్రేమికుడి పేరు విశ్వజిత్. వయసు 29. కోల్ కతాలో గవర్నమెంట్ సర్వెంట్ గా పనిచేస్తున్నాడు. రోజూ లోకల్ రైల్ లో ఆఫీసుకు వచ్చి వెళ్తుంటాడు. అలా ఓరోజు ఆఫీసుకు వెళ్తుంటే.. అలా అమ్మాయి కనిపించి మనోడి జీవితాన్నే మార్చేసింది. కానీ.. ఇంత స్వచ్ఛమైన తేనెలాంటి నీ ప్రేమను గెలిపించడానికి ఆ అమ్మాయి నిన్ను కచ్చితంగా కలుస్తుంది బ్రదర్. నీ ప్రేమ గెలుస్తుంది. గెలిచి తీరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version