షిమ్లా రోడ్లపై రయ్ రయ్ మంటూ ధోనీ బైక్ రైడింగ్..!!

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ప్రాణం. అయన దగ్గర చాలా రకాల బైక్స్ మోడల్స్ ఉంటాయి. కొత్తగా మార్కెట్ లోకి ఏ బైక్ వచ్చినా దాన్ని ధోనీ ట్రై చేయాల్సిందే. ఆయనకు బైకులన్నా.. బైక్ రైడింగ్ అన్నా ప్రాణం. ఏమాత్రం సమయం దొరికినా.. బైక్ వేసుకొని చక్కర్లు కొడుతుంటారు.

తాజాగా ఇలాగే షిమ్లా రోడ్లపై బైక్ పై రయ్ రయ్ మంటూ ధోనీ బైక్ పై దూసుకెళ్లాడట. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం షిమ్లా వచ్చిన ధోనీ షూటింగ్ విరామం సమయంలో షిమ్లా అంతా బైక్ పై చుట్టేశాడట. ఆయనతో పాటు ధోనీ మేనేజర్ కూడా బైక్ పై రైడింగ్ చేశాడట. అనంతరం ధోనీ రైడింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట. దీంతో ఆ ఫోటోలు, ఏడు సెకన్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version