నువ్వు మామూలు బాహుబలి కాదు.. శివరాజ్ సింగ్ బాహుబలి..!!

-

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలుసు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం బాషల్లో కూడా రిలీజయిన ఈ మూవీ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటింది.

ఇక అసలు విషయానికి వస్తే.. కొన్ని నెలల్లో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పార్టీలు కూడా తమ ప్రచారాలను ప్రారంభించాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాత్రం బీభత్సమైన పోటీ నెలకొన్నది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు బాహుబలి సిరీస్ లో కొన్ని సీన్లను తీసుకొని ఓ వీడియో రూపొందించాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. బాహుబలి స్పూఫ్ లా ఉండే ఆ వీడియోలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను బాహుబలిగా, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను భళ్లాలదేవగా భలే మార్ఫింగ్ చేశాడు.

ఇక.. ఈ వీడియోలో దేశంలోని ముఖ్యమైన రాజకీయ నాయకులంతా ఉన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు కట్టప్పగా నరేంద్ర సింగ్ తోమర్ ను చూపించాడు.

కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని.. శివరాజ్ సింగ్ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లోనూ శివరాజ్ సింగ్ బలం ముందు కాంగ్రెస్ పప్పులు ఉడకవనే కాన్సెప్ట్ తో ఈ వీడియోను రూపొందించాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసి కాసేపు నవ్వుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version