మనుషులు ఎలా ఉంటారంటే ఫ్రీగా పినాయిల్ వచ్చినా తాగేస్తారు. అటువంటి జనాలకు ఏవైనా షాపుల వాళ్లు బంపర్ ఆఫర్లు ప్రకటించారంటే ఇక అంతే. ఆ షాపుల ముందు క్యూ కడతారు. పొటెత్తుతారు. పనులన్నీ మానుకొని అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇటీవల హైదరాబాద్ లో ఐకియా షోరూం ప్రారంభం అయిన రోజు జనం ఎలా ఎగబడ్డారో తెలుసు కదా. మళ్లీ తర్వాత రోజు నుంచి అంతా మామూలే. జనాలు అంతే.. అందుకే వాళ్లను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి కంపెనీలు.
తాజాగా వరంగల్ లోని ఓ రెడీమెడ్ డ్రెస్సెస్ షోరూం ఇలాగే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రూపాయలకే ఓ చీర.. అంటూ ప్రచారం చేసింది. అసలే ఆడవాళ్లకు షాపింగ్ అంటే పిచ్చి. ఇక.. మూడు రూపాయలకు చీర అంటే ఊరుకుంటారా? ఆ మాల్ కు పోటెత్తారు. మామూలుగా కాదు.. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయ్యేంత. అసలు.. ఆ షోరూం యాజమాన్యం కూడా ఊహించనంత మంది క్యూ కట్టారు. దీంతో వాళ్లను కంట్రోల్ చేయలేకపోయింది యాజమాన్యం. దీంతో దుకాణాన్నే మూసేసింది. ఇక.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు క్లైమాక్స్ లో అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దుకాణం నుంచి అందరినీ పంపించేశారు. ఇంకోసారి ఇటువంటి ఆఫర్లు ప్రకటించి లేనిపోని సమస్యలు సృష్టించొద్దని పోలీసులు షోరూం యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. చివరాఖరుకు మూడు రూపాయలకు చీర వస్తుంది కదా.. ఓ పది ఇరవై అయినా కొనుక్కుందామని వెళ్లిన చాలా మంది మహిళలు మాత్రం అసహనంతో అక్కడి నుంచి పోవాల్సి వచ్చింది.