సెలవు కావాలి… జస్ట్ 730 రోజులే….

-

మీరు ఓ ఉద్యోగి అనుకోండి. సడెన్‌గా ఆఫీసు ఉన్న రోజో లేదా మరెప్పుడో మీకు ఏదో ఓ అవసరం వచ్చిందనుకోండి. ఏం చేస్తారు. ఆరోజుకు లీవ్ తీసుకుంటారు. సరే.. ఓ రెండు మూడు రోజులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఏం చేస్తారు. అప్పుడు కూడా లీవ్ తీసుకుంటం అంటారా? మరి ఓ 730 రోజులు సెలవు కావాల్సి వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఏం తిక్కతిక్కగా ఉందా. 730 రోజులు సెలవు ఎవరైనా ఇస్తారా? అని దీర్ఘాలు తీయకండి. ఎందుకంటే.. ఓ ఉద్యోగి అక్షరాలా 730 రోజులు సెలవు అడిగి ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాడు.

పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ హనీఫ్ రైల్వే ఉద్యోగి. పాకిస్థాన్ రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. కొత్తగా వచ్చిన రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తీరే మనోడికి అస్సలు నచ్చట్లేదట. ఇక.. ఈయనతో వేగడం తనతో కాదనుకొని ఏకంగా 730 రోజులు తనకు సెలవు కావాలని తన అఫీషియల్స్‌కు లీవ్ లెటర్ రాశాడు. దీంతో షాక్ తినడం రైల్వే ఆఫీసర్ల వంతయింది. ఇక.. ఆ లెటర్‌ను పాకిస్థాన్ మీడియా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దీనిపై కొంతమంది పాజిటివ్‌గా స్పందించినా.. మరికొందరు నెగెటివ్‌గా స్పందించారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ఉద్యోగి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version