రికార్డ్ బ్రేక్‌: 75 ఏళ్ల వయసులో అమ్మాయికి జన్మనిచ్చిన బామ్మ..

-

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరుకు చెందిన ఎర్రమట్టి మంగమ్మ 74 ఏళ్ల వయస్సులో పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఇప్పుడు ఎర్రమట్టి మంగమ్మ రికార్డు బద్దలైంది. రాజస్థాన్‌‌లోని కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ అమ్మాయికి జన్మనిచ్చింది. శనివారం ఆమె ప్రసవించగా, ఆదివారం వైద్యులు ధ్రువీకరించారు.

పిల్లలు లేని ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చినట్టు కింకార్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బిడ్డ 600 గ్రాముల బరువుందని, ప్రస్తుతం నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, 75 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే తొలి వృద్ధురాలిగా ఈ బామ్మ రికార్డులకెక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version