సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వారికి దంతాలు ఉండవు. కాస్త పెరిగాకా అంటే రెండు నుండి మూడు సంవత్సరాల వయస్సులో మాత్రమే వారికి దంతాలు రావడం ప్రారంభమవుతుంది. అవి కూడా ఒకటో రెండో వస్తాయి. ఇక పూర్తిగా 32 దంతాలు రావడానికి అయితే చాలా సంవత్సరాలే పడుతుంది.కానీ శిశువుకి పుట్టినప్పుడే దంతాలు ఉంటే.. అది కూడా ఒకటో రెండో కాదు ఏకంగా 32 దంతాలు ఉంటే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఇది పెద్ద వింతే. ఈ వింతకి ఎవ్వరైనా కూడా షాక్ అవ్వాల్సిందే. కానీ ఇది నిజంగానే జరిగింది.నిజానికి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటాయి. వేలల్లో ఒకరికి మాత్రమే ఇలా పుట్టుకతో 32 దంతాలు వస్తుంటాయి.
తాజాగా ఓ మహిళ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో ఆ మహిళ తన నవజాత శిశువు పరిస్థితిని ప్రస్తావించింది. దీనిపై నెటిజన్స్ అందరూ కూడా పలు రకాలుగా స్పందిస్తుననారు. కొంతమంది మాత్రం ఇది నిజంగా అద్బుతం అంటుంటే.. మరికొందరు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు.తన కూతురు ఏకంగా 32 దంతాలతో పుట్టిందని ఆ మహిళ స్లైడ్ షోలో రాసుకొచ్చింది. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆమె ఇదంతా కూడా చేసింది. ఈ వీడియోపై చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పాప చిరునవ్వు కొంత మందికి బాగా నచ్చితే, మరికొందరు మాత్రం ఆ చిన్నారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో చాలా మంది కూడా ఆ తల్లిపై సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఒక నెటిజెన్ అయితే దీనిని స్టీవ్ హార్వే కండిషన్ అని అన్నాడు. ఈ వీడియోని నికా దివా అనే అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ అయ్యింది. ఇప్పటి దాకా ఈ వీడియోని ఏకంగా 2.96 కోట్ల మందికి పైగా చూశారు.ఈ పరిస్థితిని చాలా పేర్లతో పిలుస్తున్నప్పటికీ వీటిని ఎక్కువగా నేటల్ దంతాలు లేదా బేబీ దంతాలు అని అంటారట. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. నిజానికి ఇది నవజాత శిశువుకు అయితే ఎటువంటి సమస్యను కలిగించదు.. కానీ దంతాల కారణంగా తల్లి బిడ్డకు ఆహారం ఇవ్వడంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. అదే సమయంలో ఒకవేళ దంతాలు ఊడిపోయినా.. విరిగిపోయినా చిన్న పిల్లలు కావడంతో వాటిని మింగేసే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.