తెలంగాణలోని ఆ పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ..!

-

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణ లోని ఆ పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం లోపు తీరం దాటనున్నది అల్పపీనడం. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో టోల్ ప్రీ నెంబర్ 1800 4251980 లేదా 9701999645 కి సంప్రదించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version