వంద మంది ప్రాణాలు తీసిన వింత వ్యాధి.. సోకితే డ్యాన్స్‌ చేస్తూనే ఉంటారట

-

కొన్ని వ్యాధుల లక్షణాలు, ఆ వ్యాధి చేసే ప్రభావాలు వింతగా ఉంటాయి కదా..! ఆగకుండా డ్యాన్స్‌ చేయడం ఒక వ్యాధి.. ఆ వ్యాధి సోకిందంటే.. ఇక ఆ మనిషి ఆగకుండా డ్యాన్స్‌ చేస్తూనే ఉంటారట. ఏదో తాగినప్పుడు మంచి బీట్‌ పెడితే చాలామంది ఒళ్లుతెలియకుండా చిందులేస్తారు. కానీ అది అప్పటివరకే.. ఈ వ్యాధి సోకితే తాగక్కర్లేదు, మంచి మ్యూజిక్‌ పెట్టక్కర్లేదు. అలా ఎగురుతూనే ఉంటారు..? ఇది చెప్పడం వరికే కాదు.. దీని బారిన చాలా మంది పడ్డారు, ప్రాణాలను సైతం కోల్పోయారు..

ఆధునిక కాలంలోనే కాదు 500 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వింత వ్యాధులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి డాన్సింగ్ ప్లేగ్. 15వ శతాబ్దంలో ఇది వ్యాపించి 100 మంది ప్రాణాలు కూడా తీసింది. ఇది ఎందుకు వస్తుందో, దీనికి చికిత్స ఏమిటో కూడా తెలియదు. ఫ్రాన్స్‌లో స్ట్రాస్ బర్గ్ అనే నగరంలో 1518లో జూలైలో ఈ వింత వ్యాధి ప్రబలింది. ఒక మహిళ ఒంటరిగా రోడ్డుపై నృత్యం చేస్తూ కనిపించింది. అది చూసి ప్రజలు నవ్వుకున్నారు. అయితే ఆమె తన ఇంటికి వెళ్ళాక ఏకాంతంగా కూడా అదే పనిగా నృత్యం చేసింది. ఎందుకలా చేస్తుందో ఎవరికి అర్థం కాలేదు. ఒక వారం రోజులు తర్వాత మరో ముగ్గురు డాన్స్ చేయడం మొదలుపెట్టారు. వారు ఎంతకీ డాన్స్ చేయడం ఆపలేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఆ నగరంలోని నాలుగు వందల మంది దాకా నృత్యం చేయడం ప్రారంభించారు. వారంతా కూడా నృత్యాన్ని పూనకం వచ్చినట్టు కరాళ నృత్యం చేయడం మొదలుపెట్టారు. అది వారికి ఇష్టం లేకుండానే జరుగుతోందని చూసేవారికి అర్థం అయిపోతుంది. శరీరం నీరసించిపోయి వారు కింద పడిపోయేదాకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. వారిని ఆపడం అప్పటి వైద్యుల తరం కాలేదట.

ఇలా డాన్స్ చేసిన వారిని ఏం చేయాలో తెలియక అప్పటి అధికారులు ఒక పెద్ద గదిలో బంధించారు. వారు అక్కడ డాన్స్ చేస్తూ మూర్చపోయారు. వారిలో వందమంది దాకా మరణించారు.విపరీతమైన ఒత్తిడి కారణంగా మనుషుల్లో ఇలాంటి విపరీత ప్రవర్తనలు వస్తాయని అప్పటి వైద్యులు అనుకున్నారు.

1518లో ఈ ఘటన జరిగినప్పటికీ నేటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వారికి ఎందుకు ఆ వ్యాధి సోకింది అనే రహస్యాలను తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్లో వారంతా ‘రై పిండి’తో చేసే రొట్టెను తినేవారని, ఇది ఫంగల్ వ్యాధికి కారణమై వారి శరీరంలో కలుషితమైందని.. అదే ఇలా మూర్ఛలను, విపరీత ప్రవర్తనను కలిగించిందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏది నిజమో తెలియదు కానీ ఇప్పటికీ డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version