వింత: నిజంగా ఏలియన్లు భూమి మీదకి వచ్చాయా..?

-

ఏలియన్లు అనే పేరు వింటేనే ఏదో వింతగా ఉంటుంది. అసలు నిజంగా ఇవి భూమి మీద ఉండేవా..?, ఇవి ఇక్కడ సంచరించేవా..? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే మరి నిజంగా
ఏలియన్లు భూమి మీదకు వచ్చి సంచరించాయా…? ఈ విషయం లోకి వస్తే…. హర్వార్డ్ ప్రొఫెసర్ నిజంగా సాక్ష్యాలతో చూపించడం జరిగింది. అయితే ఇదే తొలి సాక్ష్యం కూడా. వీటికి సంబందించిన ఆధారాల ప్రకారం అవి నిజమే అని తెలుస్తోంది.

హర్వార్డ్ ప్రొఫెసర్ సిగార్ షేప్‌లో ఉన్న ఆస్టరాయిడ్ 2017లో దొరికిందని అది నిజానికి వేవార్డ్ ఏలియన్ టెక్నాలజీ అని అన్నారు. ఆయన రాసిన కొత్త పుస్తకం లో ప్రొఫెసర్ ఏవీ లోయబ్ ముందుగా ఆ ఆస్టరాయిడ్ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిందని చెప్పాడు. అలానే ఇప్పుడు అదే ఏలియన్ సంచారం నక్షత్రాల మధ్య జరిగిందనడానికి సాక్ష్యం అంటున్నాడు. ఇది ఇలా ఉండగా ఆస్టరాయిడ్ 100 నుంచి 1000 మీటర్ల మధ్యలో వింత రీతిలో కదులుతుండటాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. అలానే అది మన పక్క గెలాక్సీ నుంచి వచ్చినట్లుగా కూడా భావిస్తున్నట్టు చెప్పడo జరిగింది.

స్వచ్ఛమైన కేంద్ర బిందువు నుంచి వచ్చినట్లు జులై 2019లో స్పష్టం అయిపోయింది. ఇది సోలార్ సిస్టమ్‌లోని వేగా డైరక్షన్ నుంచి 25 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి భూమికి చేరినట్లు భావిస్తున్నారు. 2017 సెప్టెంబర్ 6న అది మన సోలార్ సిస్టమ్ ఆర్టిటల్ తలాన్ని దాటి సూర్యుడి తలానికి చేరువగా సెప్టెంబర్ 9న వెళ్లింది అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news