ఫోన్‌లో సొల్లు కబుర్లు ఆపాలంటే ఈ కవర్స్ వాడండి..

-

స్మార్ట్‌ఫోన్ ఉంది కదా.. జియో ఫ్రీ కాల్స్ ఆప్షన్ ఉంది కదా అని కొంతమంది గంటలు గంటలు ముచ్చట్లు పెడుతుంటారు. అవసరానికి చేసుకోవాల్సిన ఫోన్ కాల్స్ కాస్త.. టైమ్ పాస్ కోసం చేసుకునేలా మారింది ఇప్పుడు పరిస్థితి. స్మార్ట్‌ఫోన్ పుణ్యమాని కొత్త కొత్త టెక్నాలజీలు పరిచయమవడంతో నేటి జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయిపోయింది.

దానికి విరుగుడుగా మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇటువంటి కవర్స్ వేయించుకోండంటూ.. మహింద్రా కంపెనీ చైర్మన్ ఈ ఫోటోను ట్వీట్ చేశారు. వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌ను జత చేస్తూ ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు మహింద్రా. సొల్లు కబుర్లను ఈ కవర్లు ఆపుతాయి. ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుంటే.. చెప్పులతో మీ చెంపలను వాయించుకున్నట్టు ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు మహింద్రా. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. సూపర్.. ఇది పక్కా సొల్లు కబుర్లను తగ్గిస్తుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version