ఫ్లాప్ డైరక్టర్ అఖిల్ 4..!

-

అక్కినేని అఖిల్ బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అఖిల్, హలోతో పాటుగా రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ ను కూడా అఖిల్ ను నిరాశపరచాయి. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి అఖిల్ కు అలాంటి హిట్ ఇస్తాడని అనుకోగా అది జరగలేదు. ఇలాంటి టైంలో అఖిల్ మరో షాకింగ్ డెశిషన్ తో అక్కినేని ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంతకీ అఖిల్ ఏం చేశాడు అంటే తన తర్వాత సినిమాను ఓ ఫ్లాప్ డైరక్టర్ తో చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఎవరా ఫ్లాప్ డైరక్టర్ అంటే శ్రీను వైట్ల అని తెలుస్తుంది. బ్రూస్ లీ నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా వరకు వరుస ఫ్లాపులు తీస్తున్న శ్రీను వైట్లతో సినిమా అంటే స్టార్ హీరోలే వెనక్కి తగ్గుతున్నారు. అలాంటిది అఖిల్ తన 4వ సినిమా శ్రీను వైట్లతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. శ్రీను వైట్ల చెప్పిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ అఖిల్ కు నచ్చిందట. అందుకే దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు. అఖిల్, శ్రీను వైట్ల కాంబో కన్ ఫాం అయితే ఇద్దరు హిట్టు కోసం కసితో పనిచేసే అవకాశం ఉంది. ఆ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version