వెనుక కూర్చున్న వ్యక్తి పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఓపెన్ చేయడం వల్లనే కారులో మంటలు వ్యాపించాయంటారా? వంద శాతం కాదు. అది తప్పు. చాలా మంది నెటిజన్లు కూడా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కారులో ఏసీ ఆన్ చేసి ఉన్నప్పుడు పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఉపయోగించకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియో ఏంటయ్యా అంటే.. ఆగి ఉన్న కారులో వెనుక కూర్చున్న ఓ వ్యక్తి పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఓపెన్ చేస్తాడు. అంతే.. వెంటనే కారు మొత్తం మంటలు అంటుకుంటాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలవుతాయి. నిజానికి ఈ ఘటన జరిగింది 2015లో. కానీ.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరే.. ముందు ఆ వీడియో చూడండి.. మనం తర్వాత మాట్లాడుకుందాం.
Whatsapp fwd mssg.
I'm not sure about the incident reasons.
but ?When the air-conditioner is switched on in your car,
Please do not open any perfume bottle.
Please circulate this video to your friends and relatives.? pic.twitter.com/RVNRY5Fkzh
— Kαɾαɳ||? ||?(On Drive Hyd to Vizag?) (@Hidderkaran) July 2, 2019
చూశారు కదా వీడియో. అయితే.. వెనుక కూర్చున్న వ్యక్తి పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఓపెన్ చేయడం వల్లనే కారులో మంటలు వ్యాపించాయంటారా? వంద శాతం కాదు. అది తప్పు. చాలా మంది నెటిజన్లు కూడా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కారులో ఏసీ ఆన్ చేసి ఉన్నప్పుడు పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఉపయోగించకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కానీ.. అసలు నిజం ఏంటంటే.. ఏసీ వేసి ఉన్నప్పుడు పర్‌ప్యూమ్‌ను ఓపెన్ చేస్తే మంటలు వ్యాపించే అవకాశమే లేదు. మరి.. ఆ కారులో మంటలు వ్యాపించడానికి అసలు కారణం ఏంటంటే.. కారులో ఉన్న ఫిద్‌ఫాద్ అనే స్ప్రే బాటిల్ లీక్ అయిందట. ఏ స్ప్రే బాటిల్‌లో అయినా గ్యాస్ ఉంటుంది కదా. స్ప్రే బాటిల్‌లో గ్యాస్ లీక్ అవడం… ఆ వాసన కారులో వస్తుండటంతో.. లైటర్ గ్యాస్ లీక్ అవుతుందేమో అనుకొని.. వెనుక కూర్చున్న వ్యక్తి లైటర్‌ను ఆన్ చేశాడు. అంతే.. కారులో లీక్ అయిన స్ప్రే గ్యాస్‌కు మంటలు అంటుకొని కారు మొత్తం వ్యాపించాయి. అది సంగతి.
When the Air Conditioner is switched on your car, please do not open any perfume bottle. The result can be fatal. pic.twitter.com/4X3yBQrQFj
— Born Rebel (@bornrebeldelhi) July 4, 2019
Guys please let be careful, when the Air conditioner is switched on in the car, do not open the perfume bottle. Watch this video and please rt to safe a life. pic.twitter.com/LFf1kuTH03
— femy_femi (@Makanjuolafemy) July 5, 2019