టాయిలెట్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారు ఆ ఉద్యోగులు… యాక్‌..!

-

యాక్‌.. మేం ఇప్పుడు చెప్పబోయేది వింటే నిజంగానే మీరు కూడా ఇలాగే అంటారు కాబోలు. ఎందుకంటే విషయం అలాంటిది మరి. మనం టాయిలెట్‌ను ఎంతగా క్లీన్‌ చేసినా అందులో కూర్చుని అయితే ఆహారం తినలేం కదా. ఇక అందులో పడ్డ ఆహారం తింటామా..? ఊహించుకుంటేనే కంపరంగా ఉంది కదా. ఇలా అంటున్నాం కదా అని మమ్మల్ని ఏమీ అనకండి. ఎందుకంటే కొందరు మనుషులను చూశాక మనకు కూడా మనస్సులో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసా..!

అది చైనాలోని ఓ కార్పొరేట్‌ కంపెనీ. ఆ కంపెనీలో ట్రెయినింగ్‌ తీసుకునే ఎంప్లాయిలకు విచిత్రమైన పరీక్ష పెడతారు. అదేమిటో తెలుసా..? టాయిలెట్‌లో ఆహారాన్ని ఉంచి దాన్ని తీసుకుని తింటారు. అవును, మీకు యాక్ అనిపించింది కదా. మేం ముందే చెప్పాం కదా. మీరు కూడా యాక్‌.. అని అంటారని. అస్సలు నిజంగా అలా ఎలా చేస్తారు ? మరీ టాయిలెట్‌లో ఉంచి ఆహారాన్ని ఎందుకు తింటున్నారు ? అనేగా మీ డౌట్‌..! అయితే అందుకు కారణమేమిటంటే…

ఏమీ లేదండీ.. ఆ కంపెనీలో తాము టాయిలెట్లను ఎంత నీట్‌గా ఉంచుకుంటున్నామో తెలియజేసేందుకు అక్కడి ఎంప్లాయిలు అలా టాయిలెట్‌లో ఆహారాన్ని ఉంచి మరీ తింటారట. ఇది అక్కడ కొత్తగా ట్రెయినింగ్‌ తీసుకునే వారితో చేయిస్తారట. ఇది ఆ కంపెనీ రూలట. చిత్రంలో మనకు కనిపిస్తున్నది ఆ కంపెనీకి చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌. ఆమె ఎంత చక్కగా ఆహారాన్ని టాయిలెట్‌లో పెట్టి మరీ తింటుందో కదా.. నిజంగా ఇలా చేయడం చైనా వారికే సాధ్యమవుతుంది. ఎందుకంటే వారు.. అదీ.. ఇదీ.. అనకుండా ఏదైనా తినేయగలరు కదా. ఏం చేస్తాం.. చూడ్డం మన ఖర్మ కాకపోతే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version