బొద్దింకలు లేని ఇల్లును ఊహించగలమా ఇప్పుడు. చాలా కష్టం. పగటి పూట కాస్త తక్కువగా కనిపించే బొద్దింకలు రాత్రి అయితే చాలు.. ఇంట్లో దర్జాగా తిరుగుతుంటాయి. కొంతమంది వాటి పని పడుతారు. మరికొందరు వాటిని పట్టించుకోరు. అయితే.. వీటికి నివాసం ఎక్కడుంటుంది అని ఆలోచించారా ఎప్పుడైనా? ఆ.. ఏముంది ఎక్కడో ఒక చోట మూలకు ఉంటాయిలే అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే.. అవి ఎక్కడో ఒకచోట ఉండవు. ఇదిగో ఇలా ఫోన్లలో… ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ దూరిపోతుంటాయి. దానికి ఉదాహరణ ఈ వీడియోనే.
ఇది స్మార్ట్‌ఫోన్ల కాలం కదా. ఇంకా ఆ ల్యాండ్ ఫోన్లను వాడుతున్నారా? అని అనకండి. ఇంకా వాటిని వాడేవాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ఉన్న ల్యాండ్‌లైన్ పనిచేయడం లేదని కస్టమర్ కేర్‌కు కాల్ చేశారు. ఫోన్‌ను బాగు చేయడానికి వచ్చిన వర్కర్ వచ్చి దాన్ని విప్పి చూసి షాకయ్యాడు. ఎందుకంటే.. ఆ ఫోన్ లోపల అన్నీ చనిపోయిన బొద్ధింకలు బయటపడ్డాయి. అవి కూడా వందల సంఖ్యలో అందులో గూడు కట్టుకొని ఉన్నాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వర్కర్. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.