ఎఫ్-2 రివ్యూ & రేటింగ్

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తున్న వెంకీకి హారిక (తమన్నా) తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి కూడా హంగామాగా జరుగుతుంది. ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అసలు కథ మొదలుతుంది. భార్యా భర్తల మధ్య వచ్చే కామన్ గొడవలు వారి మధ్య మొదలవుతాయి. వెంకీ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. చిన్న సమస్యకే హారిక ఫ్యామిలీ మొత్తం వచ్చి దిగుతుంది. ఇలాంటి టైంలో అతను తన మరదలు హనీ (మెహ్రీ కౌర్) వేరే అబ్బాయిని ప్రేమిస్తుందని కనిపెడతాడు. వరుణ్, హనీలు ఇద్దరు ప్రేమించుకుంటారు. యాక్సిడెంటల్ గా వరుణ్ ను కలిసిన వెంకీ ఆమెతో ప్రేమ, పెళ్లి వద్దని వారి ఫ్యామిలీ ఓ టార్చని అని చెబుతాడు అవేం పట్టించుకోని వరుణ్ హనీతో పెళ్లికి ఫిక్స్ అవుతాడు. ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఫైనల్ గా వెంకీ, వరుణ్ లకు హారిక, హనీల టార్చర్ ఎక్కువవుతుంది. మరి భార్యలతో వీరు పడే బాధ నుండి తప్పించుకునేందుకు ఏం చేశారు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

ఎలాంటి కథనైనా కామెడీతో మెప్పించవచ్చు అని పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో మెప్పించాడు అనీల్ రావిపుడి. ఈసారి మల్టీస్టారర్ తో ముందుకొచ్చాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్-2 ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వచ్చింది. కథ పాతదే అయినా కథనం ఎంటర్టైనింగ్ గా నడిపించాడు.

అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగా నవ్విస్తుంది. వెంకటేష్ మరోసారి తన పాత తరహా పంచ్ కామెడీతో మెప్పించాడు. అయితే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ నవ్విస్తారని ఆశిస్తే అక్కడ మైనస్ అయ్యింది. సడెన్ గా సినిమాను యూరప్ షిఫ్ట్ చేసి అక్కడ ప్రకాశ్ రాజ్ గుండమ్మ కథ కాన్సెప్ట్ పెట్టి ట్రాక్ తప్పించేశాడు. అప్పటిదాకా మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమా కాస్త ల్యాగ్ అయినట్టు.. బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది.

ఇక పతాక సన్నివేశాలు కూడా అంతగా మెప్పించవు. ఫైనల్ గా ఎఫ్-2 కూడా సంక్రాంతికి సగం హ్యాపీ నెస్ మాత్రమే ఇచ్చింది. వెంకటేష్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ ఉన్నట్టైతే సినిమా ఇంకా బాగా ఉండేది.

ఎలా చేశారు :

వెంకీ మార్క్ కామెడీని చాలా రోజులు మిస్సైన తెలుగు ఆడియెన్స్ ఎఫ్-2లో ఆ కిక్ ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా వెంకటేష్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాసలో మెప్పించాడు. తమన్నా, మెహ్రీన్ కౌర్ అందంతో పాటు అభినయంతో మెప్పించారు. ప్రకాశ్ రాజ్ ఓకే అనిపించగా.. ప్రియదర్శి, వెన్నెల కిశోర్, వై విజయ, అన్నపూర్ణ, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెప్పించలేదు. బిజిఎం కూడా సోసోగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎందుకో తేడా కొట్టింది. తక్కువ బడ్జెట్ తో సినిమాను పూర్తి చేశారనిపిస్తుంది. కథ, కథనాల్లో అనీల్ రావిపుడి తన టాలెంట్ చూపించలేకపోయాడు. సినిమా మొదటి భాగం కామెడీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్, వరుణ్ తేజ్

కామెడీ

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

సెకండ్ హాఫ్

ప్రొడక్షన్ వాల్యూస్

బాటం లైన్ :

ఎఫ్-2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. కొంచం ఇష్టం కొంచం కష్టం..!

రేటింగ్ : 2.75/5

Read more RELATED
Recommended to you

Exit mobile version