రైల్వే ట్రాక్‌ల మధ్య ‘వంట’.. వీడియో వైరల్ కావడంతో చర్యలు చేపట్టిన రైల్వే శాఖ

-

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలను చూస్తుంటాం.. వాటిలో కొన్ని వైరల్‌ అవుతుంటాయి. ఎందుకంటే.. అవి రొటీన్‌ కంటే భిన్నంగా ఉంటాయి. అరే ఏంట్రా ఇది అన్నట్లు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆశ్చర్యంతో పాటు ఒకింత ఆందోళన కూడా కలిగిస్తుంది. ఎవర్రా వీళ్లు ఇలా ఉన్నారు.. పోయి పోయి.. రైలు పట్టాలపైనే వంట చేసుకుంటున్నారు అని. ఇంకా హైలెట్‌ ఏంటంటే.. ఎక్కడో మారుమూల రైలు పట్టాలు కాదు.. ఏకంగా ఫ్లాట్‌ఫమ్‌ దగ్గరనే వీళ్లు వంటు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో.. రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలో ఒక బృందం వంట చేస్తున్నట్టు వీడియోలో ఉంది. ముంబై సమీపంలోని మహిమ్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇది ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో.. వీడియో త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది. వీడియోలో, మహిళలు సమూహంగా కూర్చుని ఆహారం వండుతుండగా, వారిలో కొందరు ట్రాక్ పక్కన పడుకుని దుప్పట్లు కప్పి, పిల్లలు ఆడుకుంటున్నారు.

వీడియో చూసిన వారు ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని, రైల్వే ట్రాక్‌ల మధ్య లేదా ట్రాక్‌ల సమీపంలో వంట చేయడం లేదా క్యాంపింగ్ చేయరాదని కమెంట్‌ చేశారు. చాలా మంది ఈ వీడియోను రిమైండర్‌గా షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ కూడా చర్యలు చేపట్టింది. ముంబై డివిజనల్ రైల్వే మేనేజర్ ఇప్పుడు సంబంధిత అధికారులను వివరణ కోరారు. వెంటనే ఆర్పీఎఫ్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశానికి చేరుకుని ప్రజలను ఖాళీ చేయించారు. ఇది బిచ్చగాళ్ల గుంపు అని సూచించారు.

ఈ వీడియోలో రైల్వే ట్రాక్‌ మీద మహిళలతో పాటు చిన్న చిన్న పిల్లలకు కూడా ఉన్నారు. వారికి ఆ మాత్రం తెలియదా.. పట్టాలపై ఉండటం ప్రమాదం అని.. అలా ఎలా ఈ చర్యకు పాల్పడ్డారో..! కొన్నిసార్లు సోషల్‌ మీడియా వల్ల మంచి కూడా జరుగుతుందనడానికి ఇదే ఉదాహరణ..!

Read more RELATED
Recommended to you

Latest news