తరచు మనకి ఇంటర్నెట్ లో ఏదో ఒక వీడియో కనబడుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలం లో చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో సమోసా మధ్యలో గులాబ్ జామ్ పెట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇప్పుడు కూడా తాజాగా ఒక ఫుడ్ కి సంబంధించిన వీడియో నెట్టింట్లో షికార్లు కొడుతోంది.
మరి ఆ వీడియోలో ఏముంది ఎందుకు వైరల్ అవుతోంది అనే దాని గురించి చూద్దాం. సాధారణంగా మ్యాగీ ని తయారు చేసుకుని తింటుంటాం. ఎవరైనా సరే మ్యాగీని ఇష్టపడుతుంటారు. అదే విధంగా కాటన్ క్యాండీ ని కూడా మనం కొనుక్కుని తింటూ వుంటాం. కానీ ఈ రెండిటినీ కలిపి ఒక ఆమె చేశారు. ఆమె దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.
ఈట్ థిస్ ఢిల్లీ అనే ఈ పేజీలో ఒక ఆమె ఒక కాటన్ క్యాండీ మ్యాగీ ని తయారు చేశారు. కొంత బటర్ ని వేసి ఆ తర్వాత కూరగాయల అన్నిటిని వేసి మ్యాగీ నీళ్లు సాల్ట్ ఇవన్నీ వేసి కాటన్ క్యాండిల్ కూడా దాంతో పాటు ఇచ్చారు. నెట్టింట్లో ఈ వీడియో చూసిన వాళ్ళు అందరు కూడా అవాక్కవుతున్నారు. ఇప్పటికి 12 వేల మంది ఈ వీడియోని లైక్ చేశారు ఇది ఎక్కడ రెసిపీ రా బాబు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.