పెళ్లి పత్రికను మ్యాచ్ టికెట్ లా ప్రింట్ చేయించిన క్రికెట్ అభిమాని!

-

ఇండియాలో క్రికెట్ అంటేనే పిచ్చి. మరే ఆటను పట్టించుకోరు. అదంతే.. క్రికెట్ కోసం ఎంతకైనా తెగిస్తారు అభిమానులు. ఒక్కొక్కరి అభిమానం ఒక్కోలా ఉంటుంది. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు చెన్నైకి చెందిన వినోద్ కూడా వీరాభిమాని.

దీంతో తనకు ఇష్టమైన టీమ్ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దీంతో తన పెళ్లి పత్రికను వెరైటీగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టికెట్ గా ప్రింట్ చేయించాడు. ఇక.. ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా వినోద్ పెళ్లి పత్రికను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తను ధోనీకి కూడా పెద్ద అభిమాని అట. ధోనిని చాలా సార్లు కలిశాడట. తను ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను కూడా ధోనీ వినోద్ కు గిఫ్ట్ గా ఇచ్చాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version