అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడు.. కోటిన్నర గెలుచుకున్నాడు..!

-

ఓవర్ నైట్ స్టార్లు అవ్వడమే కాదు.. ఓవర్ నైట్ కోటీశ్వరులు కూడా కావచ్చు. అవునా? ఎలా అని నోరెళ్లబెట్టకండి. ఈ వార్త చదవండి..

అతడో సాధారణ కూలి. అతడు, ఆయన భార్య ఇద్దరు కలిసి రోజంతా కష్టపడితే కానీ.. రోజు 250 రూపాయలు సంపాదించలేరు. అంత పేద కుటుంబం వాళ్లది. ఊరు పంజాబ్ లోని సంగ్రుర్ జిల్లా. వాళ్ల జీవితంలో కూడా కోట్ల రూపాయలను చూస్తామని కలలో కూడా అనుకొని ఉండరు. కానీ.. ఒక్కరోజులోనే వాళ్ల దిశ దశ రెండు మారిపోయాయి. వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. అప్పు తెచ్చి మరీ.. 200 రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొనారు. ఆ లాటరీ టికెట్ అదృష్ట లక్ష్మి రూపంలో తలుపుతట్టింది. ఏకంగా కోటిన్నర రూపాయలు లాటరీ టికెట్ ద్వారా గెలుచుకున్నారు. దీంతో వాళ్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

పంజాబ్ ప్రభుత్వం రాఖీ పండుగ సందర్భంగా రాఖీ బంపర్ లాటరీ అని ఓ లాటరీని ప్రవేశపెట్టిందట. ఆ లాటరీ టికెట్ కొన్న మనోజ్ కుమార్ కోటిన్నర గెలుచుకున్నాడు. ఇదివరకు మనోడిని ఎవ్వరూ పట్టించుకోకపోయేదట. కానీ..ఇప్పుడు బంధువులు, స్నేహితులు, బ్యాంకుల వాళ్లు మనోజ్ ఇంటికి క్యూ కడుతున్నారట. ఎంతైనా డబ్బుంటేనే మనిషికి విలువ బాస్. లేకపోతే ఒక్కడూ పట్టించుకోడు. ఉంటే ఒక్కడూ వదలడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version