ప్రపంచంలో మూఢనమ్మకాలను, తాంత్రిక విద్యలను ఎంతమంది నమ్ముతున్నారో తెలుసా..?

-

సాంకేతికత ఇంత పెరిగినా.. ఇంకా మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మేవారు ఏదో మూలు ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు మనం వార్తల్లో కూడా చూసే ఉంటాం.. మూఢనమ్మకంతో బలిదానాలు చేశారు అని.. అయితే ప్రపంచ వ్యాప్తంగా.. ఈ మూఢనమ్మకాలను, తాంత్రిక పూజలన్ని నమ్మే వాళ్లు ఎంత మంది ఉంటారు అని ఓ రీసర్చ్‌ చేశారట.. అందులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

గతంలో కూడా అనే అద్యాయనాలు, పరిశోధనలు ఈ మూఢనమ్మకాలు, తాంత్రిక పూజలపై జనం తమ నమ్మకాన్ని వీడటం లేదని రుజువు చేశాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన అమెరికన్ ఆర్థికవేత్త బోరిస్ గ్రెష్‌మాన్ తూర్పు ఆలోచనల కంటే మంత్ర విద్యపై నమ్మకం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

గ్రీష్‌మన్ 95 దేశాల్లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న 1.4 మిలియన్ల మంది నుండి అత్యంత విశ్లేషణాత్మక, వివరణాత్మక సమాచారాన్ని సేకరించి ఓ నివేదికను రూపొందించారు. అందులో 40 శాతం మంది మంత్రాల ద్వారానే శాపాలు, చేతబడులు తొలగిపోతాయని అంగీకరించినట్లుగా రీసెర్చ్‌లో తేల్చారు. ఇది అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు అంటున్నారు.

తాంత్రిక పూజలనేవి కొందరిలో అతీంద్రియ శక్తులుగా ఉంటాయి. అవి అవి ఇతరులకు హాని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, మంత్రవిద్యపై ప్రజల నమ్మకాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఆర్థిక ఊహాగానాలు, గ్లోబల్ వాల్యుయేషన్ మొదలైన వాటిలో ఇతర సంఘాలను భాగస్వామ్యం చేయడం అవసరం.

ఇటువంటి మంత్ర విద్య నమ్మేవారు ప్రపంచంలో దాదాపు ప్రతిచోటా ఉన్నారు. స్వీడన్‌లో కేవలం 9 శాతం మంది మాత్రమే వీటిని విశ్వసిస్తుండగా ట్యునీషియన్లు మాత్రం 90 శాతం నమ్మకం కలిగి ఉన్నారు. మంత్రవిద్యపై విశ్వాసం అనేక రకాల వ్యక్తులు, సమూహాలలో కనిపిస్తుంది. బాగా చదువుకున్నవారు, డబ్బున్నవారు కూడా ఈ మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారట.

నమ్మకానికి, మూఢనమ్మకానికి చిన్న తేడా మాత్రమే ఉంటుంది. దేవుడు అంటే.. ఒక పీస్‌ ఆఫ్‌ మైండ్‌కు నిదర్శనం.. ప్రశాంతను ఇచ్చే మార్గం ఆలయం.. ఇలా అనుకునేవాళ్లు కొందరైతే.. దేవుడు అంటే కచ్చితంగా ఏదైనా చేస్తాడు..ఆయనకు నచ్చిందే చేస్తే మనం మెచ్చింది ఇస్తాడు అని అనుకునేవారు కొందరు. ఇంతకీ మీరు ఎందులో ఉన్నారో..?

Read more RELATED
Recommended to you

Latest news